Bandi Sanjay Arrest: పేపర్ లీక్ నిందితులతో టచ్‌లో బండి సంజయ్.. సాయంత్రం నుంచి 10 ఫోన్ కాల్స్..?!
తెలంగాణలో వరుసగా జరుగుతున్న పేపర్ లీకేజీ వ్యవహారంలో బండి సంజయ్ హస్తం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆ కారణంగానే ఎంపీ బండి సంజయ్‌ను అరెస్ట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. టీఎస్పీఎస్సీకి సంబంధించిన పేపర్ లీకేజీలో సైతం నిందితులతో బండి సంజయ్ కి సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు
తెలంగాణలో వరుసగా జరుగుతున్న పేపర్ లీకేజీ వ్యవహారంలో బండి సంజయ్ హస్తం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆ కారణంగానే ఎంపీ బండి సంజయ్‌ను అరెస్ట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. టీఎస్పీఎస్సీకి సంబంధించిన పేపర్ లీకేజీలో సైతం నిందితులతో బండి సంజయ్ కి సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. ఇప్పుడు టెన్త్ క్లాస్ పేపర్ లీకేజీ నిందితుడు ప్రశాంత్‌తో బండి సంజయ్ కొంతకాలంగా టచ్‌లో ఉన్నట్లు చెబుతున్నారు పోలీస్ వర్గాలు. సోమవారం సాయంత్రం 5.30 గంటల నుంచి మంగళవారం ఉదయం పరీక్ష పేపర్ లీక్ అయ్యేంతవరకు పదిసార్లు ప్రశాంత్‌తో బండి సంజయ్ మాట్లాడినట్లు తేల్చారు పోలీసులు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేలా, కుట్రలు చేస్తూ.. పరీక్షలు ప్రభుత్వం సరిగా నిర్వహించట్లేదంటూ ఆరోపణలు చేసే విధంగా కుట్ర చేశారంటూ బండి సంజయ్‌పై కేసు నమోదు చేశారు వరంగల్ జిల్లా పోలీసులు.
పేపర్ లీక్ వ్యవహారంలో బండి సంజయ్ కుట్ర ఉందని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. పదో తరగతి పేపర్ లీక్ వ్యవహారంలో ఇప్పటికే ప్రశాంత్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. బండి సంజయ్‌తో అతను చాట్ చేసినట్లుగా అనుమానిస్తున్నారు. వరంగల్ సీపీ రంగనాథ్ ఇప్పటికే బండి సంజయ్ పేరు చెప్పగా.. ఈ కేసుకు సంబంధించి పూర్తి సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్నారు పోలీసులు. ప్రశాంత్‌తో వాట్సాప్ సంభాషణ, ఇతర కాల్స్‌పై ఆరా తీస్తున్నారు. బండికి, ప్రశాంత్‌కి మధ్య ఉన్న రిలేషన్ నిరూపించే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. అలాగే, టీఎస్‌పీఎస్సీ కేసులోనూ నిందితుడి రాజశేఖర్‌కి, బండి సంజయ్‌కి ఉన్న సంబంధాలపై కూపీ లాగుతున్నారు పోలీసులు. గ్రూప్ 1 లీకేజీపై బండి చేసిన ఆరోపణలకు ఇప్పటికే నోటీసులిచ్చింది సిట్.
ఇలా ప్రభుత్వాన్ని బద్నాం చేసే ఆరోపణలు ఓవైపు.. నిందితులతో ఉన్న సంబంధాలు మరోవైపు.. వెరసి బండి చేసిన కుట్రపై పోలీసుల ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. డీసీపీ స్థాయి అధికారి నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. పేపర్ లీక్ కుట్ర కోణంలో బండి సంజయ్ పాత్రపై క్షుణ్నంగా పరిశోధన చేస్తున్నారు ఖాకీలు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..