Bandi Sanjay Arrest: పట్టపగలు దొరికిన దొంగ బండి సంజయ్.. కేటీఆర్, హరీశ్ సంచలన కామెంట్స్..

ప్రశ్న పత్రాలు పంపితే తప్పేంటి అని రఘునందన్ రావు చెబుతున్నారు.. నిస్సిగ్గుగా తప్పుడు చర్యలు సమర్దిస్తున్నారంటూ హరీశ్ రావు మండిపడ్డారు.నడ్డా కూడా అబద్ధాలు చెబుతున్నారు.. మీ కార్యకర్త కాకపోతే ఎందుకు అరెస్ట్ చేయాలని ధర్నా చేస్తున్నారంటూ ప్రశ్నించారు. TSPSC పేపర్ లీక్ వెనుక కూడా మీరే ఉన్నారంటూ మండిపడ్డారు.

Bandi Sanjay Arrest: పట్టపగలు దొరికిన దొంగ బండి సంజయ్.. కేటీఆర్, హరీశ్ సంచలన కామెంట్స్..
Ktr And Harish Rao
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 05, 2023 | 1:34 PM

కేసీఆర్ ని ఎదుర్కోలేక బీజేపీ దిగజారి ప్రవర్తిస్తోంది.. బీజేపీ కుట్రలు నగ్నంగా నిన్న బయటపడ్డయంటూ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. పట్టపగలు నగ్నంగా దొరికిన దొంగ బండి సంజయ్.. పిల్లల భవిష్యత్తును తాకట్టు పెట్టి రాజకీయం చేస్తున్నారంటూ మంత్రి హరీష్ మండి పడ్డారు. బీజేపీ కుట్రల్ని దేశం మొత్తం గమనిస్తుంది.. నిన్న మధ్యాహ్నం పేపర్ లీక్ అయ్యిందని బిజెపి వాళ్ళు ధర్నా చేశారు. సాయంత్రం పేపర్ లీక్‌లో అరెస్ట్ అయిన వాళ్ళని విడుదల చేయాలని ధర్నా చేశారు.. పేపర్ లీక్ చేసింది బీజేపీ నాయకుడే.. విద్యార్థి లోకం బీజేపీ కుట్రల్ని తిప్పి కొట్టాలి.. అని హరీశ్ రావు పిలుపునిచ్చారు. ఎక్కడ కూడా ప్రశ్న పత్రం లీక్ కాలేదు.. ఇదంతా బీజేపీ ఆడుతున్న కుట్ర అంటూ మండిపడ్డారు. బీజేపీకి చదువు విలువ తెలియదు.. పేపర్ లీక్ వెనుక సూత్రధారి, పాత్రధారి బండి సంజయ్ అంటూ ఆరోపించారు. తాండూరు, వరంగల్ పేపర్ లీక్ వెనుక బండి సంజయ్ ఉన్నారన్నారు. రాష్ట్రంలో GHMC ఎన్నికలప్పుడు ఆత్మహత్య చేసుకుంటున్నట్టు నాటకాలు ఆడారు.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ఓ కుట్ర చేశారు.. 2 గంటల్లో బండి సంజయ్ కి ప్రశాంత్ 142 సార్లు ఫోన్ చేశారు. మీకు పేపర్ లీక్ తో సంబంధం లేకుంటే మీరు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించారు.

ప్రశ్న పత్రాలు పంపితే తప్పేంటి అని రఘునందన్ రావు చెబుతున్నారు.. నిస్సిగ్గుగా తప్పుడు చర్యలు సమర్దిస్తున్నారంటూ హరీశ్ రావు మండిపడ్డారు.నడ్డా కూడా అబద్ధాలు చెబుతున్నారు.. మీ కార్యకర్త కాకపోతే ఎందుకు అరెస్ట్ చేయాలని ధర్నా చేస్తున్నారంటూ ప్రశ్నించారు. TSPSC పేపర్ లీక్ వెనుక కూడా మీరే ఉన్నారంటూ మండిపడ్డారు. నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ED, CBI పేరుతో వేధిస్తుందన్నారు. మీ డ్రామాలు KCR దగ్గర చెల్లవు.. మతాన్ని రెచ్చగొట్టి లబ్ది పొందే పార్టీ బిజెపి.. నకిలీ యుద్ధాలు చేసే పార్టీ బిజెపి.. రోజు పేపర్ లీక్ అయితుందని ప్రభుత్వాన్ని బాద్నాం చేసే ప్రయత్నం చేస్తుంది.. యావత్తు తెలంగాణ ప్రభుత్వం మిమ్మల్ని అసహ్యించుకుంటుంది..చట్టము ఎవరికైనా ఒక్కటే.. బండి సంజయ్ మీద అనర్హత వేటు వేయాలి.. మీకు చీము నెత్తురు ఉంటే క్షమాపణ చెప్పండి.. అంటూ హరీశ్ రావు ఫైర్ అయ్యారు.

కేటీఆర్ సంచలన ట్వీట్..

రాష్ట్రంలో సంచలనంగా మారిన బండి అరెస్ట్‌పై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. బండి అరెస్ట్‌పై ఓ వ్యక్తి చేసిన ట్వీట్‌ను రీట్వీట్‌ చేసిన మంత్రి కేటీఆర్‌. ఆ ట్వీట్‌లో పేపర్ లీక్ కుంభకోణాల వెనుక బీజేపీ నేతల హస్తం ఉందని చెప్పడానికి ఇది మరో నిదర్శనం అంటూ.. పేపర్ లీక్ చేసిన నిందితుడు, బీజేపీ నేతలతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను షేర్ చేశారు. ఇక వాట్సాప్ గ్రూపుల్లో పేపర్‌ వైరల్ చేసిన నిందితుడు బండి సన్నిహితుడు అంటూ అందులో పేర్కొన్నారు. దీంతోపాటు కేటీఆర్ మరో ట్వీట్ కూడా చేశారు. ‘‘పిచ్చోని చేతిలో రాయి ఉంటే.. వచ్చి పోయేటోళ్ళకే ప్రమాదం…!! కానీ, అదే పిచ్చోని చేతిలో ఒక పార్టీ ఉంటే.. ప్రజాస్వామ్యానికే ప్రమాదం…!!! తమ స్వార్థ రాజకీయాల కోసం.. ప్రశ్నా పత్రాలు లీకు చేసి అమాయకులైన విద్యార్ధుల, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న బీజేపి నాయకులు’’ అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి

భౌతిక దాడులు తప్పవు.. వేముల వార్నింగ్..

10వ తరగతి పేపర్ లీక్ సూత్రదారి బీజేపీ బండి సంజయే.. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. అన్ని రకాల ఆధారాలు లభించాయి.. లక్షల మంది పిల్లలు భవిష్యత్తు, వారి తల్లి తండ్రులు ఎంత బాధ పడతారు అని కనీస బాధ్యత లేకుండా బండి సంజయ్ ప్రవర్తించారంటూ మండిపడ్డారు. కేసిఆర్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే బీజేపీ ప్రధాన ఉద్దేశం.. ప్రశాంత్ అనే వ్యక్తి బండి సంజయ్ కి ఫోటో తీసిన పేపర్ ఫోన్లో పంపించాడన్నారు. పరీక్ష మొదలైన 15 నిమిషాల్లోనే బండి సంజయ్ కు ప్రశాంత్ ద్వారా వచ్చిందన్నారు. బండి సంజయ్, బీజేపీ వాళ్ళతో ప్రశాంత్ 140 సార్లు ఫోన్లో మాట్లాడినట్లు వెల్లడించారు. వాళ్లే ఉద్దేశ పూర్వకంగా లీక్ చేస్తారు.. వాళ్లే మీడియాకి పంపిస్తారంటూ మండి పడ్డారు. పేపర్ లీక్ అయ్యింది.. ఆ పేపర్ నాకు వచ్చింది.. ప్రభుత్వం విఫల మయ్యింది అని ప్రచారం చేస్తారన్నారు. ఇది పిల్లల జీవితాలతో చెలగాటం ఆడటమే.. బండి సంజయ్ పాత్ర ఉన్నది పోలీసుల వద్ద ఆధారాలు ఉన్నాయి..చట్టం తనపని తాను చేసుకుపోతుందన్నారు. బండి అరెస్ట్ పై బీజేపీ నాయకులు కేసిఆర్ దిష్టి బొమ్మ దహనం చేస్తే ఖబర్దార్.. భౌతిక దాడులు తప్పవంటూ హెచ్చరించారు. పేపర్ లీక్ చేసి పిల్లల భవిష్యత్ ను నాశనం చేయాలని చూసిన బీజేపీ బండి సంజయ్ వైఖరి పట్ల బీజేపీ కార్యకర్తలు ఆలోచన చేయాలంటూ ఈ సందర్భంగా సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?