AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఏం ప్లాన్ వేశార్రా! పైకి కనిపించే సెటప్ వేరు.. చేసే యాపారం వేరు.. బట్ వారి ఎంట్రీతో సీన్ రివర్స్..

పుష్ప సినిమాను మరిపించేతరహాలో సరికొత్త ప్లాన్‌తో గంజాయి స్మగ్లింగ్ చేపట్టారు. కానీ ఖాకీలు పసిగట్టడంతో కథ అడ్డం తిరిగింది. ఫలితంగా వారంతా శ్రీకృష్ణ జన్మ స్థానానికి చేరారు. అదేనండీ.. జైల్లో ఊచలు లెక్కిస్తున్నారు. ఒడిస్సా టు మహారాష్ర్ట వయా వరంగల్ మీదుగా జరుగుతున్న గంజాయి హైటెక్ రాకెట్‌ను పోలీసులు చాకచక్యంగా చేధించారు. ప్లాస్టిక్ కుర్చీల వ్యాపారం మాటున ఎండు గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను..

Telangana: ఏం ప్లాన్ వేశార్రా! పైకి కనిపించే సెటప్ వేరు.. చేసే యాపారం వేరు.. బట్ వారి ఎంట్రీతో సీన్ రివర్స్..
Ganja Peddling Gang Arrest
G Peddeesh Kumar
| Edited By: Shiva Prajapati|

Updated on: Aug 05, 2023 | 1:24 PM

Share

జీవనం సాగించడానికి ఈ దునియాలో ఎన్నో ఉపాధి మార్గాలు ఉన్నాయి. కొందరు మంచి దారిని ఎంచుకుంటే.. మరికొందరు చెడు దారిని ఎంచుకుంటారు. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించి రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోవాలని ప్లాన్ వేస్తారు. ఇందుకోసం ఎంతకైనా తెగిస్తారు కంత్రీగాళ్లు. చేసే తప్పులు కప్పిపుచ్చుకోవడానికి, ఎవరికీ దొరక్కుండా ఉండేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తారు. ఆ సమయంలో వారి మెదడు కంప్యూటర్ కంటే వేగంగా పని చేస్తంది. అలా వచ్చిన ఐడియాలో అందరినీ మస్కా కొడతారు. తాజాగా అలాంటి ఘటనే వెలుగు చూసింది.

అవును, వాళ్లు మహా ముదుర్లు.. పుష్ప సినిమాను మరిపించేతరహాలో సరికొత్త ప్లాన్‌తో గంజాయి స్మగ్లింగ్ చేపట్టారు. కానీ ఖాకీలు పసిగట్టడంతో కథ అడ్డం తిరిగింది. ఫలితంగా వారంతా శ్రీకృష్ణ జన్మ స్థానానికి చేరారు. అదేనండీ.. జైల్లో ఊచలు లెక్కిస్తున్నారు. ఒడిస్సా టు మహారాష్ర్ట వయా వరంగల్ మీదుగా జరుగుతున్న గంజాయి హైటెక్ రాకెట్‌ను పోలీసులు చాకచక్యంగా చేధించారు. ప్లాస్టిక్ కుర్చీల వ్యాపారం మాటున ఎండు గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే, వీరు కొసరు నిందితులేనని, అసలు నిందితుల కోసం వేల మొదలు పెట్టారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఒడిషా రాష్ట్రం నుండి ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు అక్రమంగా గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న కమర్తపు వినయ్, బొమ్మ వేణు అనే ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఒడిశా రాష్ట్రంలోని నాగలూరు గ్రామానికి చెందిన చెందు జగన్, ముద్ద రామారావు, మహారాష్ట్రలోని ముంబైకి చెందిన కళ్యాణి రాథోడ్, పాతూరుకి చెందిన నావీద్, సాదిక్ పరారీలో ఉన్నారు. ఈ ముఠా నుండి పోలీసులు సుమారు రూ. 10.20 లక్షల విలువగల 68 కిలోల ఎండు గంజాయి, 3 సెల్ ఫోన్లు, ఒక ట్రాలీ ఆటో స్వాధీనం చేసుకున్నారు.

కాగా, ప్రధాన నిందితుడైన కమ్మర్తపు వినయ్ గత 5 సంవత్సరాలుగా.. సహ నిందితుడు బొమ్మ వేణుతో కలిసి ఒడిశా రాష్ట్రం నాగలూరు నుండి జగన్, ముద్ద రామారావు వద్ద డ్రై గంజాయి కొనుగోలు చేసి.. ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎవరి కంట పడకుండా మాస్టర్ మైండ్‌తో వారి వాహనం ద్వారా మహారాష్ట్రలోని ముంబైకి తీసుకెళ్ళి కళ్యాణి రాథోడ్, పాతూరుకి చెందిన నావీద్, సాదిక్ అనే వ్యక్తులకు అప్పగిస్తుంటారు. ఎప్పటిలాగే గురువారం సాయత్రం అక్కడ లోడ్ చేసుకున్నారు. ట్రాలీ ఆటో పై భాగంలో ప్లాస్టిక్ కుర్చీలు వేశారు. కుర్చీల కింద గంజాయి ప్యాకెట్స్ పెట్టారు. పైకి చూడడానికి కుర్చీల వ్యాపారంలా కలరింగ్ ఇస్తూ పోలీసులను కూడా మోసం చేస్తు వచ్చారు. వరంగల్‌కు వచ్చేసరికి కథ అడ్డం తిరిగింది. దేవరుప్పుల వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసులు, స్థానిక పోలీసులు రెడ్ హ్యాండెడ్ పట్టుకొని కటకటాల్లోకి పంపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..