భార్య, ఇద్దరు పిల్లలను చంపిన కేసులో వికారాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు..!
వికారాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భార్య, ఇద్దరు పిల్లలను చంపిన కేసులో భర్తకు మరణశిక్ష విధించింది. నిందితుడు గురుప్రవీణ్‌కు ఉరి శిక్ష విధించారు జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సున్నం శ్రీనివాస్ రెడ్డి. వికారాబాద్ జిల్లా కేంద్రంలో 2019లో భార్య, ఇద్దరి పిల్లను చంపాడు గురు ప్రవీణ్. భర్తతో విడాకులు తీసుకుని.. కొడుకుతో ఒంటరిగా జీవిస్తు్న్న చాందిని అనే మహిళను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు గురు ప్రవీణ్.

వికారాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భార్య, ఇద్దరు పిల్లలను చంపిన కేసులో భర్తకు మరణశిక్ష విధించింది. నిందితుడు గురుప్రవీణ్‌కు ఉరి శిక్ష విధించారు జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సున్నం శ్రీనివాస్ రెడ్డి. వికారాబాద్ జిల్లా కేంద్రంలో 2019లో భార్య, ఇద్దరి పిల్లను చంపాడు గురు ప్రవీణ్. భర్తతో విడాకులు తీసుకుని.. కొడుకుతో ఒంటరిగా జీవిస్తు్న్న చాందిని అనే మహిళను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు గురు ప్రవీణ్. తర్వాత ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చారు.
భార్య చాందిని వేరే వారితో ఫోన్‌లో మాట్లాడుతుందని అనుమానం పెంచుకున్నాడు గురు ప్రవీణ్. ఈ క్రమంలోనే ఆమెపై కక్ష పెంచున్నాడు. పిల్లలతో కలిసి నిద్రిస్తున్న సమయంలో ఇనుపరాడుతో ఆమె తలపై బలంగా కొట్టి చంపాడు. అనంతరం ఇద్దరి పిల్లలను కూడా చంపేశాడు. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు, పూర్తి సాక్షాధారాలతో చార్జీషీట్ సమర్పించారు. సుదీర్ఘంగా విచారణ జరిపిన వికారాబాద్ కోర్టు, ముద్దాయి గురుప్రవీణ్‌రే ఊరిశిక్ష విదిస్తూ తీర్పు నిచ్చింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
