అనంతగిరి ఘాట్‌లో బస్సు బీభత్సం.. లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి!
వికారాబాద్ జిల్లా అనంతగిరి సమీపంలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. అనంతగిరి నుండి తాండూరు వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోంది.

వికారాబాద్ జిల్లా: అనంతగిరి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అనంతగిరి నుంచి తాండూరు వైపు వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి రహదారి పక్కనున్న లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. బస్సులో ప్రయాణిస్తున్న 20 మందికి పైగా గాయపడినట్లు వెల్లడించారు.
బస్సు లోయలో పడిపోవడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. బస్సులో చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీసేందుకు స్థానికులు తీవ్రంగా ప్రయత్నించారు.
బస్సు అనంతగిరి నుంచి తాండూరు వైపు వెళ్తున్న సమయంలోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని లోయ నుంచి బయటకు తీసుకువచ్చి చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో రహదారి పరిస్థితులు, డ్రైవర్ నియంత్రణ కోల్పోవడానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రుల సంఖ్య, వారి పరిస్థితిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
