Wedding Card Viral: తెలంగాణ యాసలో వెరైటీ పెళ్లి కార్డు.. సోషల్ మీడియాలో వైరల్
Telangana Slang Wedding Card:ఏదైనా వైరల్ కావాలంటే అది సోషల్ మీడియా అని చెప్పక తప్పదు. అయితే ఇటీవల కాలంలో వివాహాలకు రకరకాల వెడ్డింగ్ కార్డులను ముద్రించుకుంటున్నారు. వెడ్డింగ్ కార్డుల విషయంలో కొంత వెరైటీని వాడుతున్నారు. రకరకాల కార్డులను ముద్రిస్తున్నారు. ఇటీవల నుంచి తెలంగాణ యాసలో ముద్రించిన పెళ్లి కార్డులు సోషల్ మీడియాలో తెగ వైరల్..
Telangana Slang Wedding Card:ఏదైనా వైరల్ కావాలంటే అది సోషల్ మీడియా అని చెప్పక తప్పదు. అయితే ఇటీవల కాలంలో వివాహాలకు రకరకాల వెడ్డింగ్ కార్డులను ముద్రించుకుంటున్నారు. వెడ్డింగ్ కార్డుల విషయంలో కొంత వెరైటీని వాడుతున్నారు. రకరకాల కార్డులను ముద్రిస్తున్నారు. ఇటీవల నుంచి తెలంగాణ యాసలో ముద్రించిన పెళ్లి కార్డులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సాధారణం ఒకే రకమైన కార్డులను చూసి ఉంటాము. కార్డుల్లో కొంత డిజైన్‌లు ఉన్నప్పటికీ అందులో ముద్రించే అక్షరాలు మాత్రం సాధారణమే. ఇప్పుడు అలా కాదు మొబైల్ వెడ్డింగ్ కార్డ్ అని, పాస్‌పోర్ట్ వెడ్డింగ్ కార్డ్, బంగారంతో వెడ్డింగ్ కార్డ్, కూరగాయలతో వెడ్డింగ్ కార్డ్ ఇలా రకరకాలుగా డిజైన్‌లతో పెళ్లి కార్డులను తయారు చేయించుకుంటున్నారు. ట్రెండ్ మారింది కదా అని కొత్త కొత్త వేరైటీలతో కార్డులు ముద్రించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ యాసతో తయారు చేసిన ఓ పెళ్లి కార్డు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే..
ఓ వివాహం జంట సాధారణ కార్డు మాదిరిగా కాకుండా కొంత భిన్నంగా తయారు చేయించుకుంది. సాధారణంగా కార్డులో పెళ్లి జరిగే తేదీ, చిరునామా, నవ వధూవరుల పేర్లు, బంధువుల పేర్లు, విందు లాంటి వివరాలతో ఉండే కార్డులు చూసే ఉంటాము. కానీ కొంత భిన్నంగా పెళ్లికార్డులో అచ్చమైన తెలుగుతో పాటు గ్రాంధికం, సంస్కృతం కలిపి ముద్రించారు. అయితే తెలంగాణలోని కరీనంగర్ జిల్లాకు చెందిన పోకల అనే కుటుంబం కొంత వేరైటీలో తమ వివాహ వేడుక కార్డును ప్రింట్ చేయించింది. ఈ పెళ్లి కార్డు మొత్తం తెలంగాణ యాసలోనే తయారు చేయించింది ఆ కుటుంబం. మరి ఆ కార్డును ఎలా ప్రింట్ చేయించిందో చూద్దాం.
పోకలోల్ల లగ్గం పిలుపు:
‘స్వర్గంలో ఉన్న ప్రేమగల మా బాపమ్మ – తాత పోకల నర్సమ్మ – నర్సయ్య, పెద్దబాపు పోకల వెంకట రాములు, మానెత్తలు-మామలు ఉప్పు వెంకవ్వ-మల్లయ్య, గొంటి మల్లవ్వ – మల్లయ్య, అమ్మమ్మ తాత జోగుల లక్ష్మిదేవి-లస్మయ్య నిండు నిండు దీవెనార్తెలతో అంటూ మొదలైంది.
మా ఒక్కగానొక్క పిల్లగాడు చి. మధు లగ్గం చి.ల.సౌ పల్లవితో చేసేందుకు అటోళ్లు ఇటోళ్లు ఖాయం చేసిర్రు. అందురూ జెర యాది మరిచిపోకుర్రి. అసలేరు వానలు ఉన్నాయని రాకుండా ఉండేరు.. జెర యాల్ల పొద్దుగాల్ల వచ్చి మా పిల్ల పిల్లగానికి మీ దీవెనలిచ్చి మా లగ్గం సంబురం చూసి పోతే మా మనస్సు నిమ్మలమైతది. ఇట్లు లగ్గానికి పిలిసేటోళ్లు.. అరుసుకునేటోళ్లు’. అంటూ ఇలా అచ్చ తెలంగాణ యాసను పెళ్లి పత్రికలో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వెడ్డింగ్ కార్డ్ నెట్టింట వైరల్ అవుతుంది. ఈ కార్డును చూసిన నెటిజన్లు వినూత్న రీతిలో స్పందిస్తున్నారు. ఈ కార్డును చూసి అందరి ఫిదా అవుతున్నారు. చాలా మంది గుడ్ ఐడియా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఈ వెడ్డింగ్ కార్డును మీరు కూడా చూసేయ్యండి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి