Telangana Elections: ఆ వివాదమే రమేష్ బాబు కొంప ముంచిందా.. టికెట్ రాకపోవడానికి కారణం..
Chennamaneni Ramesh Babu: నేడో రేపో తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయలేకపోయింది బీఆర్ఎస్ పార్టీ. అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయం సంచలనంగా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుకు ఆశాభంగం వెనక అసలు కారణం ఆయన పౌరసత్వ వివాదమేనని స్ఫష్టం అయింది. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రమేష్ బాబు బలమైన వ్యక్తే కానీ ఆయన పౌరసత్వ వివాదంపై తుది తీర్పు వచ్చే అవకాశం ఉన్నందున అభ్యర్థిత్వాన్ని పక్కన పెట్టాల్సి వచ్చిందన్నారు.

పదిహేనుళ్లుగా సాగుతున్న పౌర సత్వ వివాదమే.. వేములవాడ సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుకు టికెట్ రాకుండా చేసిందా.. అవునని సమాధానం చెబుతుంది.. ఇదే విషయాన్నీ.. బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు(కేసీఆర్) కూడా చెప్పారు. నేడో.. రేపో తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయలేకపోయింది బీఆర్ఎస్ పార్టీ. అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయం సంచలనంగా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుకు ఆశాభంగం వెనక అసలు కారణం ఆయన పౌరసత్వ వివాదమేనని స్ఫష్టం అయింది. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రమేష్ బాబు బలమైన వ్యక్తే కానీ ఆయన పౌరసత్వ వివాదంపై తుది తీర్పు వచ్చే అవకాశం ఉన్నందున అభ్యర్థిత్వాన్ని పక్కన పెట్టాల్సి వచ్చిందన్నారు.
2009లో ప్రత్యక్ష్య రాజకీయాల్లోకి వచ్చిన చెన్నమనేని రమేష్ బాబు మొదట టీడీపీ తరుపున పోటీ చేసి అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. 2010లో టీడీపీకి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. అప్పటి నుంచి అప్రతిహతంగా గెల్చుకుంటూ వస్తున్న చెన్నమనేనికి ఈ సారి మాత్రం చుక్కెదురే అయింది. జర్మనీ పౌరసత్వంతో ఉన్న ఆయన ఇండియాలో పోటీ చేసి చట్ట సభకు ఎన్నికయ్యారంటూ ఆయన ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ కోర్టును ఆశ్రయించారు.
ఈ విషయంలో అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా కోర్టు ముందు ఉంచినట్టుగా తెలుస్తోంది. దీంతో వేములవాడ అభ్యర్థిగా రమేష్ బాబు ఈ ఎన్నికల్లో గెలిచిన తరువాత కోర్టు తీర్పు ఇచ్చినట్టయితే ప్రత్యర్థి పార్టీకి లాభం చేకూరే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్తగా ఆలోచించే రమేష్ బాబును పక్కన పెట్టినట్టుగా తెలుస్తోంది.
ఎన్నికల్లోనే బలమైన క్యాండెట్ ను రంగంలోకి దింపి గెలిపించుకున్నట్టయితే తమ బలం మాత్రం యథావిధిగా ఉంటుందన్న యోచనలో పార్టీ ముఖ్య నాయకత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. రమేష్ బాబు ప్రస్తుతం.. జర్మనీ లో ఉన్నారు.. ఆయన ఈ రోజు ఉదయం.. ట్విట్ చేశారు.. తెలంగాణ ఉద్యమం లో కీలక పాత్ర పోషించిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.. ప్రజల ఆత్మ అభిమానం కాపాడాలని ట్విట్ చేశారు.. నిరాశ తో.. ఈ పోస్ట్ చేశారు రమేష్ బాబు.. మొత్తానికి..
పూర్తి వివరాలు ఇవే..
#CMKCR #BRSCandidatesList #AssemblyElections2023 @TV9Telugu BRS అభ్యర్థుల జాబితాను ప్రకటించిన CM KCR pic.twitter.com/GODebxWOWd
— TV9 Telugu (@TV9Telugu) August 21, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం
