AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ కక్కుర్తి తగలెయ్యా.. మేక తలకాయలు, కాళ్లతో వెళ్తున్న లారీ బోల్తా.. ఎగబడ్డ జనాలు.

చాలా మందికి నోరూరించే మేక తలకాయలు, కాళ్ల కూర అంటే చాలా ఇష్టం. వాటి ధర కూడా మార్కెట్‌లో ప్రస్తుతం భారీగానే పలుకుతోంది.

మీ కక్కుర్తి తగలెయ్యా.. మేక తలకాయలు, కాళ్లతో వెళ్తున్న లారీ బోల్తా..  ఎగబడ్డ జనాలు.
Goat Legs And Heads
Sanjay Kasula
|

Updated on: Apr 20, 2023 | 7:17 PM

Share

ఇక ఒక్కోసారి పొలాల్లోకి చేపలు వచ్చిన ఘటనలు విని ఉంటాం. అంతేకాకుండా వర్షం పడినప్పుడు ఆకాశం నుంచి కూడా చేపలు పడ్డాయని వార్తల్లో చూసి ఉంటాం. రూపాయికి బిర్యాణీ అంటే కిలోమీటరు పొడువున క్యూ కట్టిన జనంను మనం చూశాం. పాయా అంటే ఇష్టపడే వారికి ఇటీవల పంట పండింది. చేతిలో పెద్ద కవర్ పట్టుకుని వచ్చి, చేతికందినన్ని మేక తలకాయలు, కాళ్ల  తీసుకు పోయారు. ఈ ఆసక్తికర ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మెదక్ జిల్లా తూప్రాన్‌ మీదుగా వెళ్తున్న ఓ లారీ బోల్తా పడింది. లారీలో ఉన్న  లో మేక తలకాయలు, కాళ్ల లోడ్ తో వెళ్తున్న లారీ బోల్తా పడింది. దీంతో రామాయంపేట వాసులు కాళ్ళు, తలకాయలు తీసుకెళ్లడానికి ఎగబడ్డారు. తర్వాత వాటిని తీసుకుని ఎంచక్కా ఇంటికి పోయారు.

కొందరైతే తమ దగ్గర ఉన్న సంచులలోనూ, ఇంకొందరు ఏమీ లేకపోవడంతో రెండు చేతుల్లో నాలుగు మేక తలకాయలు తీసుకుని ఇంటికి తీసుకుపోయారు. కాళ్ళు, తలకాయల కోసం చాలా మంది ఒక్కసారిగా రోడ్డుపైకి రావడంతో వాహనాలు నిలిచిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

ఉత్తర ప్రదేశ్ లక్నో నుంచి హైదరాబాద్ కు మేక తలకాయలు, కాళ్లు ఐస్ బాక్స్ ల్లో తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ కి గాయాలయ్యాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం