Collector Marraige: ఆదర్శ కలెక్టర్..ఆర్టీసీ బస్సులో పెళ్లి మండపానికి.. సజ్జనార్ ప్రశంసలు
Collector Marraige: ప్రభుత్వం ఉద్యోగం(Government Employees) చేసే చాలా మంది ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులకు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. స్వయంగా జిల్లా కలెక్టర్(District Collector) ప్రభుత్వ ఆస్పత్రిలో..
Collector Marraige: ప్రభుత్వం ఉద్యోగం(Government Employees) చేసే చాలా మంది ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులకు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. స్వయంగా జిల్లా కలెక్టర్(District Collector) ప్రభుత్వ ఆస్పత్రిలో పురుడుపోకుంటున్నారు. కొంతమంది కలెక్టర్ , సహా అనేక మంది ఉద్యోగులు తమ పిల్లలను గవర్నమెంట్ స్కూల్స్ లో చదివిస్తున్నారు. చాలామంది ప్రభుత్వ అధికారులు పలు సందర్భాల్లో తమ అధికారాన్ని పక్కన పెట్టి సామాన్యులకు దగ్గరవుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇదిగో ఈ కలెక్టర్ కూడా ఆ కోవకు చెందినవారే..తెలంగాణాలోని ఓ జిల్లా కలెక్టర్ తన ప్రత్యేకతను చాటుకుని ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..
సిద్దిపేటకు చెందిన దంపతులు సురేశ్, నిర్మల తనయుడు మంద మకరంద్ ప్రస్తుతం నిజామాబాద్‌లో అసిస్టెంట్ కలెక్టర్‌గా చేస్తున్నారు. కాగా అతని వివాహం కరీంనగర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సాయితేజితతో ఫిబ్రవరి 11న హైదరాబాద్ శివారులోని నార్సింగి వద్ద ఓం కన్వెన్షన్‌లో జరిగింది. కల్యాణ మండపానికి వరుడు సహా అతడి కుటుంబీకులు, బంధువులు సిద్దిపేట ఆర్టీసీ బస్సులో చేరుకున్నారు. దీంతో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విటర్ వేదికగా ఆ కలెక్టర్‌ను అభినందించారు. ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ పెళ్లికి హాజరై ప్రశంసించారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, సీపీ మహేశ్ భగవత్ సహా పలువురు ఉన్నతాధికారులు ఈ వివాహానికి హాజరై కలెక్టర్ దంపతులను ఆశీర్వదించారు. పెల్లి కార్డు ఇచ్చే సమయంలోనూ తన విభిన్నతను చాటుకున్నారు ఈ యువ కలెక్టర్. విత్తనాలతో కూడిన పర్యావరణ హిత పెళ్లి పత్రికను స్నేహితులు, సహ అధికారులకు స్వదస్తూరితో అందించారు. పోచంపల్లి చేనేత వస్త్రంతో మాస్కులు కుట్టించి పంచారు. ఆహ్వాన పత్రిక భూమిలో వేస్తే మొక్కగా ఎదుగుతుందని అలా చేసినట్లు తెలిపారు.
#IChooseTSRTC Privileged to bless the newly weds Mr.Makarandu & Ms Tejitha, IASProbationer on behalf of TSRTC & VC &MD Sri.VCSajjanar IPS. Thanked him for choosing TSRTC for Guests’ conveyance @tsrtcmdoffice @TSRTCHQ @AjayPuvvada @Govardhan_MLA @SomeshKumarIAS pic.twitter.com/HkEuTNHKuX
— Vinod ED Engg TSRTC (@EDEnggTSRTC) February 11, 2022
Also Read: