Uppal Lands Auction: కాసుల వర్షం కురిపిస్తోన్న ఉప్పల్ భగాయత్ ప్లాట్ల వేలం.. ధర తెలిస్తే మూర్చ పోవాల్సిందే..!

Uppal Lands Auction: ఉప్పల్‌ భగాయత్‌ మూడో దశ వేలంలోనూ హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)కు ఊహించని రీతిలో కాసుల వర్షం కురిపిస్తోంది.

Uppal Lands Auction: కాసుల వర్షం కురిపిస్తోన్న ఉప్పల్ భగాయత్ ప్లాట్ల వేలం.. ధర తెలిస్తే మూర్చ పోవాల్సిందే..!
Uppal
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 03, 2021 | 5:46 AM

Uppal Lands Auction: ఉప్పల్‌ భగాయత్‌ మూడో దశ వేలంలోనూ హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)కు ఊహించని రీతిలో కాసుల వర్షం కురిపిస్తోంది. తొలిరోజు వేలంలో అధికారుల అంచనాలు దాటేస్తూ మూసీ తీరాన ప్లాట్లు గతంలో కంటే భారీ స్థాయిలో ధరలు పలికాయి. జూబ్లీహిల్స్‌ లాంటి ప్రాంతాలతో పోటీ పడుతూ ఉప్పల్‌లోనూ రెండు ప్లాట్లు చదరపు గజానికి రూ.1.01లక్షల చొప్పున ధర పకడం గమనార్హం. మూడో దశలో మొత్తం 44 ప్లాట్లలో తొలిరోజు 23 ప్లాట్లకు వేలం జరిగింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌టీఎస్‌ వేదికగా జరిగిన ఈ ప్రక్రియలో ఉప్పల్‌ ప్రాంతానికి భవిష్యత్తు ఉందనే నమ్మకంతో ప్రవాసీయులతోపాటు స్థానిక రియల్టర్లు నువ్వా నేనా అన్నట్టుగా ధరలు పెంచుకుంటూ పోయారు. చదరపు గజానికి రూ.35వేలు నిర్ధారిత ధర ఉండగా.. ఉదయం సెషన్లో ఓ ప్లాటుకు అత్యధికంగా చదరపు గజానికి రూ.77వేలు, రెండో సెషన్‌లో రెండు ప్లాట్లు ఏకంగా రూ.1.01లక్షల రికార్డు ధరలు పలికాయి. కేవలం 19వేల చదరపు గజాలకే రూ.141.61 కోట్లు తొలి రోజు రాగా, శుక్రవారం మిగిలిన 1.15లక్షల చదరపు గజాల్లో మొత్తం 21 ప్లాట్లకు సగటున రూ.60వేలు వరకు వచ్చినా సుమారు రూ.900 కోట్లు ఖజానాకు వస్తాయని హెచ్‌ఎండీఏ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

భారీ అంచనాలు.. మల్టీ పర్పస్‌ జోన్‌కి కేటాయించిన 12.04 ఎకరాల్లో 10 ప్లాట్లతో పాటు మరో 11 ప్లాట్లను శుక్రవారం వేలం వేయనున్నారు. తొలిరోజు ప్రవాసీయులు పెద్ద ఎత్తున ఇందులో పాల్గొనడంతో రెండో రోజు మల్టీపర్పస్‌ భూములకు చదరపు గజానికి కనీసం రూ.70వేల దాకా పలికే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. దీని ద్వారా ఉప్పల్‌ భూ విక్రయాల్లో రికార్డు సృష్టించనుందని చెబుతున్నారు.

Also read:

HMDA: మూసీ తీరంలో కాసుల వర్షం.. ఉప్పల్‌ భగాయత్‌ గజం ఎంతో తెలుసా..

Hebah Patel: హెబ్బా పటేల్‌ను ఇలా ఎప్పుడైనా చూసారా ?? ఆకట్టుకుంటున్న కుమారి లేటెస్ట్ ఫొటోస్

Johannes Vetter-Neeraj Chopra: నీరజ్ స్వర్ణం గెలవడం భారత్‌కే కాదు.. జావెలిన్ క్రీడకే గర్వకారణం: జర్మన్ త్రోయర్ జోహన్నెస్ వెటర్

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!