Kishan Reddy: ‘కేంద్రం తగ్గించింది.. రాష్ట్రం సంగతేంటి?’.. సీఎం కేసీఆర్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు..
Minister Kishan Reddy: తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పెట్రోల్, డీజిల్‌పై ట్యాక్స్ తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న..
Minister Kishan Reddy: తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పెట్రోల్, డీజిల్‌పై ట్యాక్స్ తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఉటంకిస్తూ.. తెలంగాణ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇకనైనా ఫామ్ హౌస్ నుంచి బయటకు రండి కేసీఆర్ అంటూ విమర్శించారు. ‘తెలంగాణ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు రావాలి. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించి రాష్ట్ర ప్రజలపై కనికరం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నాను. గత 6 నెలల్లో కేంద్రం రెండుసార్లు డీజిల్, పెట్రోల్‌పై వ్యాట్ తగ్గించింది. రాష్ట్రం కూడా తగ్గిస్తే ప్రజలకు ఊరట కలుగుతుంది.’’ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
‘‘ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ.9.5, రూ.7 చొప్పున వ్యాట్ తగ్గించింది. ఈ నిర్ణయం సాహసోపేతమైనది. దీని వలన కేంద్ర ప్రభుత్వానికి రూ. 1 లక్ష కోట్ల ఆదాయం నష్టపోవాల్సి వస్తుంది. గత 6 నెలల్లో పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించడం ఇది రెండవసారి.’’ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించారు. ‘‘నవంబర్ 2021&మే 2022 మధ్య అత్యధిక వ్యాట్ రేటుతో తెలంగాణ ప్రభుత్వం టాప్‌లో నిలిచింది. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ ద్వారా రూ.2000 కోట్లు లబ్ధిపొందింది. ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణలో పెట్రోల్‌పై లీటర్‌కు రూ.6, డీజిల్‌పై రూ. 5 చొప్పున అధికంగా వసూలు చేస్తోంది.’’ అని ఆరోపించారు కిషన్ రెడ్డి. ఇకనైనా సీఎం కేసీఆర్ స్పందించి.. ప్రజల సౌకర్యార్థం పెట్రోల్, డీజిల్‌పై ట్యాక్స్ రేట్లను తగ్గించాలని డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి.
These are key decisions that will help the common citizen in the country.
I welcome Hon Finance Minister @nsitharaman‘s extensive measures as reducing the Central excise duty on Petrol & diesel prices, providing Gas cylinder subsidy to over 9 cr Ujjwala Yojana beneficiaries… https://t.co/CmUjdFKo8X
— G Kishan Reddy (@kishanreddybjp) May 21, 2022
.@narendramodi govt continues to reduce central excise duty on Petrol & Diesel- second time in the last 6 months.
Today central govt reduced the price of petrol by ₹ 9.5/ litre & of Diesel by ₹ 7/ ltr with a revenue implication of around ₹ 1 lakh crore/year for central govt. https://t.co/Lzm64idRgi
— G Kishan Reddy (@kishanreddybjp) May 21, 2022
Between Nov 2021 & May 2022,with one of the highest VAT rate Telangana Govt has gained approx. INR 2,000 crore by not reducing VAT rates on petrol & diesel.
I appeal to the Telangana CM to come out of his farmhouse & show empathy for the common man of Telangana by reducing VAT
— G Kishan Reddy (@kishanreddybjp) May 21, 2022