Kishan Reddy: తెలంగాణకు కొత్త రైల్వే లైన్‌.. మోదీకి ధన్యవాదాలు తెలిపిన కిషన్‌ రెడ్డి

ఇక దేశవ్యాప్తంగా రైల్వే కనెక్టివిటీని మరింత బలోపేతం చేయాలన్న ఉద్దేశ్యంతో 7 రాష్ట్రాలకు లబ్ధి చేకూర్చేలా రూ. 24,657 కోట్ల అంచనా వ్యయంతో 800 కి. మీ. ల పొడవున నిర్మించనున్న 8 నూతన రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలుపుతూ ఈ నెల 9 వ తేదీన జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. కేంద్ర మంత్రి మండలి ఆమోదించిన 8 నూతన రైల్వే లైన్ ప్రాజెక్టులలో...

Kishan Reddy: తెలంగాణకు కొత్త రైల్వే లైన్‌.. మోదీకి ధన్యవాదాలు తెలిపిన కిషన్‌ రెడ్డి
Kishan Reddy
Follow us

| Edited By: Narender Vaitla

Updated on: Aug 10, 2024 | 7:14 PM

శుక్రవరం జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశంలో 7 రాష్ట్రాల మీదుగా వెళ్లే 8 కొత్త రైల్వేలైన్స్‌ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఇందులో ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న భద్రాచలం రైల్వే లైన్‌ కూడా ఒకటి. భద్రాచలం-మల్కాన్‌గిరి నూతన రైల్వేలైన్‌కు కేంద్రం ఆమోదం తెలిపడంపై స్పందించిన మంత్రి కిషన్‌రెడ్డి.. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ధన్యవాదాలు తెలియజేశారు. కొత్తగా ప్రతిపాదించిన ఈ రైల్వేన్‌ పొడవు మొత్తం 173 కిమీలు కాగా, ప్రాథమిక అంచనా వ్యయం రూ. 4109 కోట్లుగా అంచనా వేశారు. భద్రాచలం పుణ్యక్షేత్రాన్ని మెయిన్ లైన్ రైల్ నెట్ వర్క్‌తో ఈ కొత్త ప్రాజెక్ట్‌ను అనుసంధానం చేయనున్నారు.

ఇక దేశవ్యాప్తంగా రైల్వే కనెక్టివిటీని మరింత బలోపేతం చేయాలన్న ఉద్దేశ్యంతో 7 రాష్ట్రాలకు లబ్ధి చేకూర్చేలా రూ. 24,657 కోట్ల అంచనా వ్యయంతో 800 కి. మీ. ల పొడవున నిర్మించనున్న 8 నూతన రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలుపుతూ ఈ నెల 9 వ తేదీన జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. కేంద్ర మంత్రి మండలి ఆమోదించిన 8 నూతన రైల్వే లైన్ ప్రాజెక్టులలో రూ. 4,109 కోట్ల అంచనా వ్యయంతో 173 కి. మీ. ల పొడవున నిర్మించనున్న భద్రాచలం – మల్కాన్ గిరి నూతన రైల్వే లైన్ ప్రాజెక్టు కూడా ఉండటంతో తెలంగాణ రాష్ట్రానికి కూడా పెద్దఎత్తున లబ్ధి చేకూరనుంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న భద్రాచలం పట్టణానికి నూతన రైల్వే లైన్ డిమాండ్ ఈ ప్రాజెక్టుతో నెరవేరనుంది.

భద్రాచలం (పాండురంగాపురం) – మల్కాన్ గిరి (జునాఘడ్) నూతన రైల్వే లైన్ ప్రాజెక్టు భద్రాచలం పట్టణాన్ని మెయిన్ లైన్ రైల్ నెట్ వర్క్ తో అనుసంధానం చేస్తుంది. మొదట ప్రతిపాదించిన భద్రాచలం – మల్కాన్ గిరి రైల్వే లైన్ 147.5 కి. మీ. లు మాత్రమే. అనంతరం ఈ ప్రాజెక్టును మరో 26.1 కి. మీ. లు పెంచి భద్రాచలం నుంచి పాండురంగాపురం వరకు పొడగించారు. జైపూర్ – మల్కాన్ గిరి మధ్యన చేపట్టిన నూతన రైల్వే లైన్ ఇప్పటికే నిర్మాణంలో ఉండగా, ఇప్పుడు కొత్తగా ప్రతిపాదించిన భద్రాచలం – మల్కాన్ గిరి నూతన రైల్వే లైన్ సౌత్ సెంట్రల్ రైల్వే (పాండురంగాపురం) – ఈస్ట్ కోస్ట్ రైల్వే (జునాఘడ్) మధ్యన నూతన కారిడార్ అభివృద్ధికి బాటలు వేయనుంది.

ఈ ప్రాజెక్టు కారణంగా ఇప్పటి వరకూ రైల్వే సౌకర్యం లేని అనేక ప్రాంతాలకు నూతనంగా రైల్వే సౌకర్యాలు అందుబాటులోకి రావడంతోపాటు ఆయా ప్రాంతాలు సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధిని సాధించనున్నాయి. అంతేకాకుండా ఈ నూతన ప్రాజెక్టుతో తెలంగాణ, ఛత్తీస్ ఘడ్, ఒడిషా రాష్ట్రాల మధ్యన ప్రజల రాకపోకలు పెరగడమే కాకుండా ఆయా ప్రాంతాలు వ్యవసాయం, వాణిజ్యం, విద్య, పర్యాటకం, ఆరోగ్య సంరక్షణ వంటి వివిధ రంగాలలో వృద్ధిని సాధించడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ నూతన ప్రాజెక్టు దక్షిణ ఒడిషా, ఛత్తీస్ ఘడ్ ప్రాంతాలు, దక్షిణ భారతదేశంలోని ఇతర ప్రాంతాలతో వాణిజ్య సంబంధాలు పెంపొందించుకోవడానికి ఒక ప్రత్యామ్నాయ మార్గంగా ఉపయోగపడటమే కాకుండా, ఒడిషా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలలోని గనులు, అల్యూమినియం, స్టీల్ ఫ్యాక్టరీల నుంచి ఆంధ్రప్రదేశ్ సముద్రతీర ప్రాంతంలో ఉన్న పోర్టులకు ఉత్పత్తులను తరలించడానికి దూరం కూడా 140 కి. మీ. తగ్గుతుంది.

ఈ నూతన రైల్వే లైన్ ఛత్తీస్ ఘడ్ నుంచి ప్రజలు హైదరాబాద్, విజయవాడ ప్రాంతాలను చేరుకోవడానికి దూరాన్ని, ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాకుండా దక్షిణ ఒడిషా, సెంట్రల్ ఒడిషా ప్రాంతాల నుంచి హైదరాబాద్, విజయవాడ నగరాలకు నేరుగా కనెక్టివిటీని అందుబాటులోకి తెస్తుంది. అంతేకాకుండా పారాదీప్ పోర్టును అనుసంధానిస్తూ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న నేషనల్ వాటర్ వే 5 తో భవిష్యత్తులో ఈ నూతన రైల్వే ప్రాజెక్టును అనుసంధానించి మల్టీమోడల్ ట్రాన్స్ పోర్ట్ ను అభివృద్ధి చేసే అవకాశం కూడా ఉంది. దీనితోపాటు జాతీయ రహదారి 326 మీదుగా జరుగుతున్న సరుకు రవాణాను మరింత వేగంగా, సమర్థవంతంగా నిర్వహించడానికి పెద్ద మొత్తంలో ఆకర్షించి రైల్వే నెట్ వర్క్ తో అనుసంధానం చేసే అవకాశం కూడా ఉంది. ఈ నూతన రైల్వే ప్రాజెక్టుకు ఉన్న మల్టీ మోడల్ ట్రాన్స్ పోర్ట్ అవకాశం దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో ఉన్న కృష్ణపట్నం, మచిలీపట్నం, నూతనంగా నిర్మిస్తున్న రామాయపట్నం పోర్టుల నుంచి కూడా సరుకు రవాణాను సమర్థవంతంగా నిర్వహించడానికి అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

తెలంగాణకు కొత్త రైల్వే లైన్‌.. మోదీకి కిషన్‌ రెడ్డి ధన్యవాదాలు
తెలంగాణకు కొత్త రైల్వే లైన్‌.. మోదీకి కిషన్‌ రెడ్డి ధన్యవాదాలు
అందంలోనే కాదు.. ఆస్తిలోనూ తక్కువ కాదు..
అందంలోనే కాదు.. ఆస్తిలోనూ తక్కువ కాదు..
వర్షాకాలంలో కాల్చిన మొక్కజొన్న పొత్తులు తింటున్నారా? ఇది మీ కోసమే
వర్షాకాలంలో కాల్చిన మొక్కజొన్న పొత్తులు తింటున్నారా? ఇది మీ కోసమే
రోజుకు ఎన్ని చెంచాల నెయ్యి తినాలి..? అతిగా తింటే ఏమవుతుందంటే..
రోజుకు ఎన్ని చెంచాల నెయ్యి తినాలి..? అతిగా తింటే ఏమవుతుందంటే..
10 గంటల్లో 4.5 కిలోలు తగ్గిన అమన్ సెహ్రావత్.. ఏం చేశాడో తెలుసా?
10 గంటల్లో 4.5 కిలోలు తగ్గిన అమన్ సెహ్రావత్.. ఏం చేశాడో తెలుసా?
పెరుగు, వేయించిన జీలకర్ర పొడి కలిపి తీసుకోండి.. ఫలితం మీరే చూడండి
పెరుగు, వేయించిన జీలకర్ర పొడి కలిపి తీసుకోండి.. ఫలితం మీరే చూడండి
కూతురి పుట్టిన రోజున వారికి రూ.10 లక్షల విరాళమిచ్చిన మంచు విష్ణు
కూతురి పుట్టిన రోజున వారికి రూ.10 లక్షల విరాళమిచ్చిన మంచు విష్ణు
మనీష్ సిసోడియా విడుదలతో ఆప్‌కి కొత్త ఊపిరి..
మనీష్ సిసోడియా విడుదలతో ఆప్‌కి కొత్త ఊపిరి..
73 లక్షల మొబైల్ క‌నెక్షన్ల ర‌ద్దు.! రీవెరిఫికేష‌న‌ల్‌లో విఫ‌లంతో
73 లక్షల మొబైల్ క‌నెక్షన్ల ర‌ద్దు.! రీవెరిఫికేష‌న‌ల్‌లో విఫ‌లంతో
మూలధన లాభాలపై పన్ను ఆదా కావాలా? ఇదొక్కటే మార్గం.. వెంటనే చేసేయండి
మూలధన లాభాలపై పన్ను ఆదా కావాలా? ఇదొక్కటే మార్గం.. వెంటనే చేసేయండి
వర్షాకాలంలో కాల్చిన మొక్కజొన్న పొత్తులు తింటున్నారా? ఇది మీ కోసమే
వర్షాకాలంలో కాల్చిన మొక్కజొన్న పొత్తులు తింటున్నారా? ఇది మీ కోసమే
పెరుగు, వేయించిన జీలకర్ర పొడి కలిపి తీసుకోండి.. ఫలితం మీరే చూడండి
పెరుగు, వేయించిన జీలకర్ర పొడి కలిపి తీసుకోండి.. ఫలితం మీరే చూడండి
73 లక్షల మొబైల్ క‌నెక్షన్ల ర‌ద్దు.! రీవెరిఫికేష‌న‌ల్‌లో విఫ‌లంతో
73 లక్షల మొబైల్ క‌నెక్షన్ల ర‌ద్దు.! రీవెరిఫికేష‌న‌ల్‌లో విఫ‌లంతో
జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ.!
జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ.!
హిజాబ్ ధరించనందుకు అరెస్టు.. ఆ వెంటనే మిస్సింగ్‌ కూడా.!
హిజాబ్ ధరించనందుకు అరెస్టు.. ఆ వెంటనే మిస్సింగ్‌ కూడా.!
సొంత నానమ్మ ఇంటినే కూల్చేసిన కిమ్‌.! సవతి సోదరుడిపై విషప్రయోగం.!
సొంత నానమ్మ ఇంటినే కూల్చేసిన కిమ్‌.! సవతి సోదరుడిపై విషప్రయోగం.!
బంగ్లాదేశ్‌ సంక్షోభం.. భారత్ పై ఎఫెక్ట్ ఎంత.? వీడియో..
బంగ్లాదేశ్‌ సంక్షోభం.. భారత్ పై ఎఫెక్ట్ ఎంత.? వీడియో..
రూటు మార్చిన స్మగ్లర్లు.! సముద్ర మార్గంలో సినిమా తరహాలో ఛేజింగ్..
రూటు మార్చిన స్మగ్లర్లు.! సముద్ర మార్గంలో సినిమా తరహాలో ఛేజింగ్..
సోదరితో కలిసి షాపింగ్‌ చేసిన షేక్‌ హసీనా.! తీవ్ర షాక్‌లో బృందం..
సోదరితో కలిసి షాపింగ్‌ చేసిన షేక్‌ హసీనా.! తీవ్ర షాక్‌లో బృందం..
వారికి తాము చనిపోతామని ముందే తెలిసిపోయిందా.? విషాద ప్రయాణం..
వారికి తాము చనిపోతామని ముందే తెలిసిపోయిందా.? విషాద ప్రయాణం..