Telangana: నల్గొండ పట్టణంలో ఘోర ప్రమాదం.. ఏసీ సిలిండర్ పేలి ఇద్దరు మృతి..
నల్లగొండ జిల్లా కేంద్రంలో పెను విషాదం చోటు చేసుకుంది. ఏసీ సిలిండర్ పేలి ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. నల్లగొండ పట్టణంలోని బర్కత్‌పుర కాలనీలోని ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న న్యూ స్టార్ ఫ్రూట్స్ కంపెనీ కోల్డ్ స్టోరేజిలో ఏసీ గ్యాస్ సిలిండర్ మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

నల్లగొండ జిల్లా కేంద్రంలో పెను విషాదం చోటు చేసుకుంది. ఏసీ సిలిండర్ పేలి ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. నల్లగొండ పట్టణంలోని బర్కత్‌పుర కాలనీలోని ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న న్యూ స్టార్ ఫ్రూట్స్ కంపెనీ కోల్డ్ స్టోరేజిలో ఏసీ గ్యాస్ సిలిండర్ మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో కోల్డ్ స్టోరేజి ఓనర్ షేక్ కలీమ్, అందులో పనిచేసే వ్యక్తి సాజిద్ మృతి చెందారు. పేలుడు ధాటికి వారి శరీర భాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రమాద సమయంలో కోల్డ్ స్టోరేజ్‌లో పనిచేస్తున్న మరో నలుగురు ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
