రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో పెట్రోలింగ్ పోలీసుల దాడిలో బోర్ మెకానిక్ కుమ్మరి వెంకటేష్ కంటి చూపు కోల్పోయారు. టాయిలెట్ కోసం వెళ్లిన వెంకటేష్ పై పోలీసులు విచక్షణారహితంగా దాడి చేసి, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కొట్టారని బాధితుడు ఆరోపిస్తున్నాడు.