AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అదే బ్యాడ్.! పైకి కనిపించేవి నోరూరించే స్వీట్లే.. తిన్నారనుకోండి కథ కంచికే

బ్రాండ్‌ను నమ్మి స్వీట్లు కొంటున్నారా? అయితే ఈ వార్త మీకోసమే! అత్తాపూర్‌లోని ప్రముఖ స్వీట్ హౌస్‌ ‘హల్దీరామ్స్’ అసలు రంగు బయటపడింది. ఇక నుంచి షాప్‌కు వెళ్లామా? కావాల్సింది కొనుక్కున్నామా? అని కాకుండా.. ప్రతీది చెక్‌ చేసుకోవాలని ఈ ఘటన హెచ్చరిస్తోంది.

Telangana: అదే బ్యాడ్.! పైకి కనిపించేవి నోరూరించే స్వీట్లే.. తిన్నారనుకోండి కథ కంచికే
Telangana
Ravi Kiran
|

Updated on: Feb 18, 2026 | 8:19 AM

Share

బ్రాండ్ పేరు చూసి వెళ్లే వినియోగదారులకు అత్తాపూర్‌లోని ప్రముఖ స్వీట్ షాప్ హల్దీరామ్స్ చేదు అనుభవాన్ని మిగిల్చింది. నాణ్యతకు మారుపేరు అని చెప్పుకునే ఈ సంస్థ, కుళ్ళిపోయిన ఆహారాన్ని అమ్ముతూ సామాన్యుల ఆరోగ్యంతో చెలగాటమాడుతోంది. అత్తాపూర్‌లోని హల్దీరామ్ స్వీట్ హౌస్‌లో స్వీట్లు కొనుగోలు చేసిన వినియోగదారులు.. అవి పాడైపోయి ఫంగస్ పట్టి ఉండటాన్ని గమనించారు. పాడైపోయిన స్వీట్ల గురించి నిర్వాహకులని ప్రశ్నించగా, బాధ్యతారాహిత్యంగా, నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్లు బాధితులు ఆరోపించారు.

యాజమాన్యం తీరుతో విసిగిపోయిన బాధితులు వెంటనే అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కల్తీ, నాణ్యత లేని స్వీట్లను విక్రయిస్తున్నారనే ఫిర్యాదుతో హల్దీరామ్ స్వీట్ హౌస్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. పాడైపోయిన స్వీట్లను పోలీసులు స్వాధీనం చేసుకుని, పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపారు. ల్యాబ్ రిపోర్ట్ లో కల్తీ జరిగిందని తేలితే యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. హైదరాబాద్ సిటీలో తనిఖీలు చేసిన ప్రతీసారి ఇలా కొన్ని స్వీటు షాపుల నిర్వాకం బయటపడుతూనే ఉంది. కల్తీ లేని ఆహారం.. నాణ్యమైన సేవలు’ నోరూరించే మిఠాయిల పేరుతో కుళ్ళిపోయిన స్వీట్లను అమ్ముతూ కస్టమర్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. పేరున్న సంస్థలే ఇలా చేస్తే, సామాన్యుడు ఎవరిని నమ్మి తినాలి? అని జనం ప్రశ్నిస్తున్నారు. ఆహార భద్రతా నిబంధనలను తుంగలో తొక్కి వినియోగదారుల ప్రాణాలతో చెలగాటమాడే సంస్థలపై కఠినంగా వ్యవహరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Follow Us
బజాజ్ పల్సర్‌‌ నుంచి కొత్త వేరియంట్లు.. N160 ఫీచర్లు తెలుసా
బజాజ్ పల్సర్‌‌ నుంచి కొత్త వేరియంట్లు.. N160 ఫీచర్లు తెలుసా
ఒక్క పొరపాటుతో జీవితకాల సంపాదన ఆవిరైపోతుంది.. తస్మాత్‌ జాగ్రత్త!
ఒక్క పొరపాటుతో జీవితకాల సంపాదన ఆవిరైపోతుంది.. తస్మాత్‌ జాగ్రత్త!
తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్‌తో అవోర్ EX ..ఫీచర్లు ఇవే
తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్‌తో అవోర్ EX ..ఫీచర్లు ఇవే
రికార్డుల మోత మోగిస్తున్న కియా PV5
రికార్డుల మోత మోగిస్తున్న కియా PV5
ప్లాట్ వర్సెస్ ఫ్లాట్.. దేనిలో పెట్టుబడి పెడితే ఎక్కువ రాబడి?
ప్లాట్ వర్సెస్ ఫ్లాట్.. దేనిలో పెట్టుబడి పెడితే ఎక్కువ రాబడి?
మేర్లపాక గాంధీని చూసి దర్శకులు నేర్చుకోవాలి: చిరంజీవి
మేర్లపాక గాంధీని చూసి దర్శకులు నేర్చుకోవాలి: చిరంజీవి
జేబీఎల్ నుంచి అదిరిపోయే ఇయర్‌బడ్స్.. పూర్తి వివరాలు
జేబీఎల్ నుంచి అదిరిపోయే ఇయర్‌బడ్స్.. పూర్తి వివరాలు
షుగర్‌ ఉన్నవారు భోజనం తర్వాత 10 నిమిషాలు నడిస్తే ఏమవుతుందో తెలుసా
షుగర్‌ ఉన్నవారు భోజనం తర్వాత 10 నిమిషాలు నడిస్తే ఏమవుతుందో తెలుసా
ప్రతిరోజు ఒక్క గ్లాస్ తాగితే ఉక్కులాగా ఆరోగ్యంగా ఉంటారు..
ప్రతిరోజు ఒక్క గ్లాస్ తాగితే ఉక్కులాగా ఆరోగ్యంగా ఉంటారు..
వరమహాలక్ష్మి వ్రతానికి ఈ రంగు చీరలే ఎందుకు ప్రత్యేకమో తెలుసా?
వరమహాలక్ష్మి వ్రతానికి ఈ రంగు చీరలే ఎందుకు ప్రత్యేకమో తెలుసా?