AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Silver Prices: కుప్పకూలిన వెండి ధరలు.. గంటల్లోనే రేట్లు తారుమారు.. ఒకేసారి ఎంత తగ్గిందంటే..?

పసిడి ధరలు తగ్గముఖం పడుతూనే ఉన్నాయి. గత కొన్ని వారాలుగా ధరలు పడిపోతూ వస్తోన్నాయి. ఒకేసారి భారీ స్థాయిలో పతనమవుతూ వస్తోన్నాయి. రానున్న రోజుల్లో మరింత దిగువకు ధరలు చేరుకోవచ్చనే అంచనాలు విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయంటే..

Silver Prices: కుప్పకూలిన వెండి ధరలు.. గంటల్లోనే రేట్లు తారుమారు.. ఒకేసారి ఎంత తగ్గిందంటే..?
Silver
Venkatrao Lella
|

Updated on: Feb 18, 2026 | 11:53 AM

Share

ప్రపంచవ్యాప్తంగా పసిడి ధరల్లో అస్థిరత కొనసాగుతోంది. జనవరిలో గోల్డ్ రేటు రూ.1.90 లక్షల మార్క్‌కు చేరుకోగా.. వెండి ధర రూ.4 లక్షల మార్క్‌ను అధిగమించి ఆల్ టైం రికార్డ్ దిశగా దూసుకెళ్లాయి. ఆ తర్వాత గత కొద్ది వారాల నుంచి ధరలు తగ్గుతూ వస్తోన్నాయి. గత ఏడాది ధరలు ఒకేసారి రికార్డ్ స్థాయిలో పెరగడం మార్కెట్ విశ్లేషకులను ఆశ్చర్యపర్చగా… ఈ ఏడాది ఎలా ఉంటాయనేది పెద్ద మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. ఈ ఏడాది ప్రారంభంలో పెరిగిన ధరలు.. ఇప్పుడు మళ్లీ భారీగా పతనమవుతున్నాయి. బంగారం రూ.లక్ష కిందకు పడిపోవచ్చని, వెండి రూ.2 లక్షలకు పడిపోవచ్చని అంచనాలు వేస్తున్నాయి. ప్రస్తుతం ధరలు తగ్గుతుండటంతో ఆ అంచనాలను బలపరుస్తున్నాయి.

ఒకే రోజు రూ.5 వేలు తగ్గుదల

బుధవారం వెండి ధర ఒకేరోజు రూ.5 వేల మేర పడిపోయింది. బుధవారం కేజీ సిల్వర్ రూ.2.60 లక్షలకు చేరుకుంది. మంగళవారం ఈ ధర రూ.2.65 లక్షల వద్ద స్ధిరపడింది. నిన్నటితో పొలిస్తే ఇవాళ కేజీ వెండిపై రూ.5 వేలు తగ్గుముఖం పట్టింది. హైదరాబాద్‌లో కేజీ వెండి ప్రస్తుతం రూ.2.60 లక్షలుగా కొనసాగుతోంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇదే ధరలు ఉన్నాయి. ఇక బెంగళూరులో బుధవారం కేజీ సిల్వర్ రేటు రూ.2.55 లక్షలుగా ఉంది. నిన్న ఈ ధర రూ.2.60 లక్షలుగా ఉంది. ఇక చెన్నైలో ప్రస్తుతం రూ.2.60 లక్షలుగా ఉండగా.. నిన్న రూ.2.65 లక్షల వద్ద స్థిరపడింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో రూ.2.55 లక్షలుగా ఉంది. నిన్నటితో చూస్తే అన్ని ప్రాంతాల్లో కేజీ వెండిపై రూ.5 వేలు తగ్గిందని చెప్పవచ్చు. సిల్వర్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు.

తగ్గిన ఆందోళనలు

వెండితో పాటు బంగారం ధరలు కూడా పడిపోయాయి. బుధవారం మల్టీ కమోడిటీ ఎక్చేంజ్‌(MCX)లో బంగారం, వెండి రేట్లు పాజిటివ్ నోట్‌తో ప్రారంభమయ్యాయి. జెనీవాలో అమెరికా, ఇరాన్ మధ్య చర్చల్లో పురోగతి కనిపించడంతో భౌగోళిక రాజకీయ పరిస్థితుల ఆందోళనలు కాస్త తగ్గాయి. దీంతో సురక్షితమైన కొనుగోలుకు పెట్టుబడిదారులు ఆసక్తి చూపించారు. ఎంసీఎక్స్‌లో ఏప్రిల్ 2026 డెలివరీకి సంబంధించి గోల్డ్ ప్యూచర్స్ 10 గ్రాములకు 1.2 శాతం పెరిగి రూ.1,53,303కి చేరుకుంది. ఇక మార్చి 5న జరగాల్సిన సిల్వర్ ప్యూచర్స్ కిలోకు 2 శాతం పెరిగి రూ.2,33,339కి చేరుకున్నాయి. అటు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం రూ.1,54,350 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,41,500 వద్ద ఉంది. బంగారం ధరలు ప్రస్తుతం స్ధిరంగా కొనసాగుతున్నాయి.

Follow Us
Prabhas: దెబ్బ మీద దెబ్బకు.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న ప్రభాస్‌
Prabhas: దెబ్బ మీద దెబ్బకు.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న ప్రభాస్‌
కోటిన్నరకు భర్తను అమ్మేసిన భార్య.. కారణం ఇదే !! మహానుభావురాలు
కోటిన్నరకు భర్తను అమ్మేసిన భార్య.. కారణం ఇదే !! మహానుభావురాలు
'నన్ను ఎవరూ పెళ్లి చేసుకోవడం లేదు' స్టార్ హీరోయిన్ ఆవేదన
'నన్ను ఎవరూ పెళ్లి చేసుకోవడం లేదు' స్టార్ హీరోయిన్ ఆవేదన
మిత్రుడైనా.. రెమ్యునరేషన్లో నో కాంప్రమైజ్‌ గురూ..!
మిత్రుడైనా.. రెమ్యునరేషన్లో నో కాంప్రమైజ్‌ గురూ..!
'ధురంధర్'లో విలర్‌ ఛాన్స్ మిస్‌ !! నాగార్జున రియాక్షన్
'ధురంధర్'లో విలర్‌ ఛాన్స్ మిస్‌ !! నాగార్జున రియాక్షన్
ఐబొమ్మ రవికి బెయిల్ మంజూరు..! కానీ కండీషన్స్ అప్లయ్
ఐబొమ్మ రవికి బెయిల్ మంజూరు..! కానీ కండీషన్స్ అప్లయ్
అసలు ప్రత్యూష కేసులో ఏం జరిగింది..? సిద్ధార్థ రెడ్డి ఎవరు..?
అసలు ప్రత్యూష కేసులో ఏం జరిగింది..? సిద్ధార్థ రెడ్డి ఎవరు..?
ఉనికిలో లేని కేసులా? AI మాయాజాలంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన
ఉనికిలో లేని కేసులా? AI మాయాజాలంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన
ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. హైవే పై ఎగసిపడిన అగ్నికీలలు
ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. హైవే పై ఎగసిపడిన అగ్నికీలలు
అధికారుల పనితీరుపై రేవంత్ రెడ్డి సీరియస్! క్లాస్ పీకిన సీఏం
అధికారుల పనితీరుపై రేవంత్ రెడ్డి సీరియస్! క్లాస్ పీకిన సీఏం