Telangana Politics: ఎక్కడి నుంచే పోటీ చేస్తానో తెలియదు..పొంగులేటి చేరికపై రేణుక చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు
Renuka Chowdhury: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరికను స్వాగతిస్తున్నట్లుగా ప్రకటించారు. తాను వ్యతిరేకించినట్టు ఎవరు చెప్పారు..? తాను ఎక్కడైనా మాట్లాడానా.. అంటూ ప్రశ్నించారు. ఏ స్థానం నుంచి ఎవరు పోటీ చేయాలి అనేది తాము అనుకుంటే సరిపోదు. అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు

ఢిల్లీ, జూన్ 26: పొంగులేటి కాంగ్రెస్‌లోకొస్తున్నారు. అంతకంటే ముందే ఖమ్మం నేతలు అలర్ట్ అయ్యారు. పార్టీ పెద్దలముందు వాలిపోయారు ఆ జిల్లా ఫైర్‌బ్రాండ్ రేణుక చౌదరి. జిల్లాలో తన వర్గానికి ప్రాధాన్యం లేదన్న అసంతృప్తితో ఉన్న రేణుకా చౌదరి.. కొత్త నాయకులొస్తే తన పొజిషనేంటని హైకమాండ్‌ని అడుగుతున్నారంటూ వస్తున్న వార్తలకు చెక్ పెట్టారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరికను స్వాగతిస్తున్నట్లుగా ప్రకటించారు. తాను వ్యతిరేకించినట్టు ఎవరు చెప్పారు..? తాను ఎక్కడైనా మాట్లాడానా.. అంటూ ప్రశ్నించారు. ఏ స్థానం నుంచి ఎవరు పోటీ చేయాలి అనేది తాము అనుకుంటే సరిపోదు. అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. తాను పార్లమెంటుకు పోటీ చేస్తానో, అసెంబ్లీకి పోటీ చేస్తానో ఎవరికి తెలుసు?అసలు పార్లమెంటుకు, అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరగవచ్చన్నారు. బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒకటే అంటూ విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్ నేతలకు కేసీఆర్ పాకెట్ మనీ ఇస్తున్నారంటు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన కామెంట్స్‌కు ఆమె కౌంటర్ ఇచ్చారు. బండి సంజయ్ ఎవరి దగ్గర పాకెట్ మనీ తీసుకుంటున్నారో తెలీదా? అంటూ సెటైర్లు వేశారు. కోవర్టులు అన్ని పార్టీల్లోనూ ఉన్నారని.. రాజకీయ వ్యవస్థలో కోవర్టులు ఒక భాగం అని కాంగ్రెస్‌లోనూ కోవర్టులు ఉన్నారంటూ చెప్పడంతో అంతా షాక్ అయ్యారు. కోవర్టులతో కాంగ్రెస్ పార్టీకి నష్టం లేదన్నారు. కానీ ఇరిటేషన్ ఉంటుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ రోజురోజకీ పెరుగుతోందన్నారు.
ఇదిలావుంటే, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరిక నేపథ్యంలో ఢిల్లీలో చక్రం తిప్పుతున్నారు రేణుక చౌదరి. ఇటీవలే ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. తన వర్గంలోకి కీలక నేతలతో ఢిల్లీలోనే మకాంవేశారు రేణుకా చౌదరి. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మాణిక్‌రావ్ ఠాక్రేతో భేటీ అయ్యారు రేణుకా చౌదరి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం
