AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తేనెతో ఫేస్ మాస్క్.. ర్మానికి వచ్చే అద్భుత ప్రయోజనాలు.. బ్యూటీ బెనిఫిట్స్‌ తెలిస్తే…

కాశ్మీరీ మహిళలు మచ్చలేని చర్మం, మెరిసే ముఖంతో ఉంటారని ప్రసిద్ధి.. చాలా మంది మహిళలు మెరిసే చర్మాన్ని కోరుకుంటారు. దాని కోసం వారు చేయగలిగినదంతా చేస్తారు. అయినప్పటికీ, వారి ముఖాలు కోరుకున్నంతగా ప్రకాశించవు. కాశ్మీరీ మహిళలు మెరిసే చర్మాన్ని పొందడానికి సహజ పదార్థాలను ఉపయోగిస్తారని మీకు తెలుసా? కాశ్మీరీ మహిళలంతా అందమైన ముఖం కోరుకునే వారికి తేనె ఒక అద్భుతమైన ఔషధం అని తెలిస్తే మీరు షాక్‌ అవుతారు..

తేనెతో ఫేస్ మాస్క్.. ర్మానికి వచ్చే అద్భుత ప్రయోజనాలు.. బ్యూటీ బెనిఫిట్స్‌ తెలిస్తే...
honey face masks
Jyothi Gadda
|

Updated on: Feb 18, 2026 | 1:17 PM

Share

తేనెను ముఖానికి రాసుకుంటే చర్మం అందంగా, ప్రకాశవంతంగా మారుతుంది. చర్మం డల్‌గా ఉన్నవారు తేనె రాసుకుని 30 నిమిషాలు ఉంచి చల్లటి నీటితో కడిగితే సరిపోతుంది. తేనె నేచురల్ మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. చర్మంలో తేమను నిల్వ ఉంచుతుంది. స్కిన్ డ్రై అవ్వకుండా చూస్తుంది. అందుకే పొడి చర్మం ఉన్నవారు తేనె రాసుకుని 20 నిమిషాలు ఉంచి కడిగేసుకుంటే మంచిది. దుమ్ము, ధూళిలో ఎక్కువగా తిరిగే వారు ఇంటికి వచ్చాక తేనెను ముఖానికి రాసుకుని 20 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకోండి. అయితే ముందుగా నార్మల్ వాటర్‌తో కడిగాక తేనె అప్లై చేయాలి. ఇలా చేస్తే కాలుష్యం నుంచి చర్మాన్ని కాపాడుకోవచ్చు.

తేనెను ముఖానికి అప్లై చేసుకుంటే మంచి ఎక్స్‌ఫోలియేటర్ మాదిరిగా పనిచేస్తుంది. మృత కణాలను తొలగిస్తుంది. చర్మం కాంతివంతంగా, తాజాగా ఉంటుంది. తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే తేనె ముఖానికి రాసుకుంటే మొటిమలు, చర్మ సమస్యలు తగ్గుతాయి. తేనెను ముఖానికి రాసుకుంటే స్కిన్ టోన్ చాలా బాగుంటుంది. చర్మం అందంగా, ప్రకాశవంతంగా మారుతుంది.

తేనె చర్మాన్ని టైట్‌గా ఉంచుతుంది. ముఖంపై ఫైన్ లైన్స్, ముడతలు వంటివి తగ్గిపోతాయి. తద్వారా వయసు పెరిగినా యవ్వనంగా ఉంటారు. తేనెను నిమ్మరసంతో కలిపి ముఖానికి రాసుకుంటే ట్యాన్ సమస్య నుంచి బయటపడొచ్చు. స్కిన్ చాలా బాగుంటుంది. తేనె డ్రై స్కిన్, ఆయిల్ స్కిన్, సెన్సిటివ్ స్కిన్ ఇలా ఎవరికైనా బాగా పనిచేస్తుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. నేచురల్ గ్లో కూడా పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

తేనెను ముఖానికి రాసుకోవడం వల్ల చర్మం అందంగా, ప్రకాశవంతంగా మారుతుంది. ఇది సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తూ తేమను నిల్వ ఉంచుతుంది, పొడి చర్మాన్ని నివారిస్తుంది. తేనె మృత కణాలను తొలగించి, మొటిమలు, ముడతలను తగ్గిస్తుంది. యాంటీ బాక్టీరియల్ గుణాలతో చర్మాన్ని రక్షిస్తుంది, అన్ని రకాల చర్మాలకు తేనె సురక్షితమైన, అద్భుతమైన పరిష్కారం.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us