AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పప్పులు ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే.. ఈ సూపర్ టిక్స్‌ తప్పక ట్రై చేయండి.. !

చాలా మంది బియ్యం, పప్పులు నిల్వ చేసుకున్నప్పుడు పురుగులు పట్టి పాడవుతుంటాయి, డబ్బు వృధా అవుతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా, వాటిని ఎక్కువ కాలం తాజాగా ఉంచడానికి సరైన నిల్వ పద్ధతులు అవసరం. తేమ లేకుండా ఎండబెట్టడం, గాలి చొరబడని డబ్బాలలో భద్రపరచడం, పొడి ప్రదేశాలలో ఉంచడం, వెల్లుల్లి లేదా బిర్యానీ ఆకులు వేయడం వంటి చిట్కాలను పాటించి, పురుగుల బెడద లేకుండా చూసుకోవచ్చు. ఇది ఆహార నాణ్యతను కాపాడటంతో పాటు అనారోగ్యాల నుండి రక్షిస్తుంది.

పప్పులు ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే.. ఈ సూపర్ టిక్స్‌ తప్పక ట్రై చేయండి.. !
Pulses Fresh Longer
Jyothi Gadda
|

Updated on: Feb 18, 2026 | 1:33 PM

Share

చాలా మంది ఏడాదికి సరిపడా బియ్యం, పప్పులు నిల్వచేసుకుంటూ ఉంటారు. కానీ, అవి కొద్ది రోజులకే పురుగులు పట్టి పోతుంటాయి. దాంతో సరుకు పాడవటమే కాకుండా డబ్బు కూడా వృద్ధా అవుతుంది. అంతేకాదు.. అలా పురుగులు పట్టిన ఆహార పదార్థాలను తినటం వల్ల రోగాలు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. మరోవైపు, బియ్యం, పప్పులకు పట్టిన పురుగులు ఇళ్లంతా పారుతూ మరింతగా ఇబ్బంది పెడుతుంటాయి. ఇదంతా లేకుండా ఉండాలంటే..అధిక మొత్తంలో తెచ్చుకున్న బియ్యం, పప్పులను సరైన పద్ధతిలో స్టోర్‌ చేసుకోవటం తప్పనిసరి. ఇందుకు కొన్ని సింపుల్ ట్రిక్స్‌ ఉన్నాయి.. అవేంటో ఇక్కడ చూద్దాం…

పప్పులకు తేమ తగిలితే పురుగులు వస్తాయి. అందుకే పప్పులను కొన్నాక ఇంటికి తీసుకొచ్చి ఎండలో రెండు నుంచి మూడు గంటలు పాటు ఉంచండి. తర్వాత గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేయండి. వంటగదిలో పప్పులను పొడిగా ఉన్న ప్రదేశంలోనే నిల్వ చేయండి. సింక్ దగ్గర, స్టవ్ పక్కన పెట్టకండి. దీనివల్ల తేమ లేకుండా ఎక్కువ కాలం వస్తాయి. పప్పులను నిల్వ చేసేందుకు ఎయిర్‌టైట్ కంటైనర్లను ఉపయోగిస్తే ఎక్కువకాలం పాటు ఫ్రెష్‌గా ఉంటాయి. అంత ఈజీగా పాడైపోవు.

ఎక్కువకాలం పాటు పప్పులు నిల్వ ఉండాలంటే పప్పులను గాలి చొరబడని డబ్బాలో ఉంచి ఫ్రిజ్‌లో స్టోర్ చేయండి. తద్వారా ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. వెల్లుల్లి కూడా ఘాటుగా ఉంటుంది. పప్పుల్లో వెల్లుల్లి రెబ్బలు వేస్తే కూడా పురుగులు రాకుండా ఉంటాయి. పప్పులు పాడైపోకుండా ఉంటాయి. లేదంటే, పప్పుల డబ్బాల్లో బిర్యానీ ఆకులు వేస్తే ఆ ఘాటుకు పురుగులు చేరవు. ఎక్కువకాలం పాటు పురుగులు పట్టకుండా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

ఎక్కువ మోతాదులో పప్పులను నిల్వ చేస్తే సమస్య వస్తుంది. చిన్న డబ్బాల్లో వాటిని విడగొట్టి ఉంచితే తాజాగా ఉంటాయి. నేరుగా సూర్యకాంతి పడే ప్రదేశంలో పప్పులను ఉంచకండి. దాని వల్ల పప్పుల నాణ్యత తగ్గిపోతుంది. నెలకొకసారైనా పప్పుల డబ్బాలను మూత తీసి చూస్తూ ఉండండి. తేమ ఉందేమో చూసుకోవాలి. ఒకవేళ తేమ ఉన్నట్లయితే మళ్లీ ఆరబెట్టుకోవాలి.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us