Medak: టపాసులు కొనేందుకు వెళ్తుండగా ప్రమాదం.. కవలలు దుర్మరణం
మెదక్ పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. టపాసులు కొనేందుకు ఇద్దరు కుమారులతో కలిసి స్కూటీపై బయల్దేరింది తల్లి. కానీ అనుకోని ప్రమాదం వారిని వెంటాడింది. స్కూటీ ప్రమాదవాశాత్తూ టిప్పర్‌ను ఢీకొట్టడంతో.. 12 ఏళ్ల వయసున్న కవలలు టిప్పర్ కింద నలిగి ప్రాణాలు కోల్పోయారు. రెండేళ్ల క్రితమే ఆ మహిళ భర్తను పోగొట్టుకుంది. ఇప్పుడు పిల్లలిద్దరూ...

దీపావళి అంటే పిల్లలకు ఎంత సంబరమో కదా..! నాన్న తెచ్చిన మతాబులు కాల్చుతూ, అమ్మ చేసిన పిండిన వంటలు తింటూ ఎంత ఆనందంగా గడుపుతారో. అలాంటి పండుగ పూట మెదక్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ తల్లి తన తన కవల పిల్లలకు టపాసులు కొనేందుకు తీసుకెళ్తుండగా అనుకోని ప్రమాదం జరిగింది. స్కూటీ ప్రమాదవశాత్తు టిప్పర్ ఢీ కొట్టడంతో పిల్లలిద్దరూ (పృథ్వీతేజ్ (12), ప్రణీత్ తేజ్ (12) )స్పాట్ లోనే దుర్మరణం చెందారు. ఈ యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడిన తల్లి అన్నపూర్ణను స్థానిక ఆస్ప్రతికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అన్నపూర్ణ భర్త రెండు సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలోనే మృతి చెందారు. నేడు ఆమె కన్న పేగులను సైతం పోగట్టుకుంది. దీంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మీ పిల్లలు జాగ్రత్త తల్లీ..!
దీపావళి అంటే పిల్లలకు బాంబులు కాల్చాలనే సరాదా ఎంతో ఉంటుంది. ఎంతో మారాం చేసి మరీ టపాసులు కొనేలా చేస్తారు. అవి కాల్చేటప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తగా పక్కనే ఉండాలి. పసి ప్రాయంలో అనర్థాలు పిల్లలకు తెలియవు. చిన్న నిర్లక్ష్యం పెను ప్రమాదానికి కారణం కావచ్చు. కంటికి దగ్గరలో క్రాకర్స్‌ను ఉంచి కాల్చకూడదు. కాటన్ దుస్తులు ధరించాలి. ఎక్కువ కాంతిని ఇచ్చే టపాసులు కాల్చేటప్పుడు కంటికి కళ్లజోడు పెట్టుకోవాలి. కొన్ని క్రాకర్స్ వెలగట్లేదని, పేలడం లేదని కొందరు వాటి దగ్గరకు వెళ్లే క్రమంలో అవి పేలుతుంటాయి.. అలాంటి పని అస్సలు చేయవద్దు. సంతోషాలతో జరుపుకొనే పండుగను విషాదాంతంగా మార్చుకోవద్దు. భద్రం తల్లీ..!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..