TV9 Impact: టీవీ9 వరుస కథనాలతో తెలంగాణ సర్కారీ ఉద్యోగుల్లో కదలిక..

టీవీ9 వరుస కథనాలతో తెలంగాణ సర్కారీ ఉద్యోగుల్లో కదలిక వచ్చింది. చాలావరకు ప్రభుత్వ ఆఫీసులు, ఆస్పత్రుల్లో సమయ పాలన కనిపిస్తోంది. ఉదయం పదిన్నర కల్లా ఆఫీసుల్లో అటెండెన్స్‌ వేయించుకుంటున్నారు ఉద్యోగులు. ఇక సర్కారీ దవాఖానాలకు ఉదయం 9 గంటల కల్లా వైద్యులు, వైద్య సిబ్బంది చేరుకుంటున్నారు. అయితే హైదరాబాద్‌కి హార్ట్‌ లాంటి GHMC ఎంప్లాయీస్‌లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు.

TV9 Impact: టీవీ9 వరుస కథనాలతో తెలంగాణ సర్కారీ ఉద్యోగుల్లో కదలిక..
Tv9 Impact
Follow us

|

Updated on: Jul 10, 2024 | 9:44 AM

టీవీ9 వరుస కథనాలతో తెలంగాణ సర్కారీ ఉద్యోగుల్లో కదలిక వచ్చింది. చాలావరకు ప్రభుత్వ ఆఫీసులు, ఆస్పత్రుల్లో సమయ పాలన కనిపిస్తోంది. ఉదయం పదిన్నర కల్లా ఆఫీసుల్లో అటెండెన్స్‌ వేయించుకుంటున్నారు ఉద్యోగులు. ఇక సర్కారీ దవాఖానాలకు ఉదయం 9 గంటల కల్లా వైద్యులు, వైద్య సిబ్బంది చేరుకుంటున్నారు. అయితే హైదరాబాద్‌కి హార్ట్‌ లాంటి GHMC ఎంప్లాయీస్‌లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. వాళ్లు పంక్చువాలిటీకి పంక్చర్లు వేస్తూనే ఉన్నారు. ఉదయం 12 గంటల తర్వాతే ఆఫీసుకు చేరుకుంటున్నారు. టీవీ9 ఫ్యాక్ట్‌ చెక్‌ డే-5లో…తెలంగాణ వ్యాప్తంగా నిన్న ఉదయం పదిన్నర గంటలకు సర్కారీ ఆఫీసుల్లో, దవాఖానాల్లో అటెండెన్స్‌ చూద్దాం…

కరీంనగర్‌ ప్రభుత్వాసుపత్రిలో పని చేసే వైద్యులు, వైద్య సిబ్బందిలో కొంత మార్పు కనిపిస్తోంది. ఉదయం 9 గంటల కల్లా 70 శాతం డాక్టర్లు, సిబ్బంది విధులకు హాజరయ్యారు. అయితే ఈ ఆస్పత్రిని కొన్ని సమస్యలు పట్టి పీడిస్తున్నాయి.

ఇక టీవీ9 కథనాలతో ఖమ్మం సర్కారీ దవాఖానా.. వైద్యులు, సిబ్బందితో కళకళలాడుతోంది. ఉదయం 9 గంటలకు స్టార్ట్‌ కావాల్సి ఓపీ, 8 గంటలకే స్టార్ట్‌ అవుతోంది. ఇవాళ ఉదయం పదిన్నరకు ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో పరిస్థితి ఏమిటో మా సీనియర్‌ కరస్పాండెంట్‌ నారాయణ వివరిస్తారు.

గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో…ఉద్యోగుల అటెండెన్స్‌ ఏమంత గ్రేట్‌గా లేదు. ఉదయం పదిన్నరకు రావాల్సిన ఎంప్లాయీస్‌లో చాలామంది ఆ టైమ్‌కి డ్యూటీకి రావడం లేదు. ఇక కొంతమంది ఉద్యోగులు ఉదయం పదింటికే ఆఫీసుకు వచ్చి, బయోమెట్రిక్‌లో రిజిస్టర్‌ చేసుకుని బయటకు వెళ్లిపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అడవుల జిల్లా ఆదిలాబాద్‌ ఉద్యోగుల్లో మార్పు వచ్చినట్లే కనిపిస్తోంది. చాలావరకు టైమ్‌కి ఠంఛన్‌గా ఆఫీసులకు హాజరవుతున్నారు. ఈ మార్పుకు టీవీ9 కథనాలే కారణమంటున్నారు పబ్లిక్‌. టీవీ9 ఫ్యాక్ట్‌ చెక్‌ ఇంపాక్ట్ ఇదంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..