13వ రోజుకు చేరిన ఆర్టీసీ స్ట్రైక్.. కేసీఆర్ కీలక నిర్ణయం

ఆర్టీసీ సమ్మె పై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. సమ్మె విరమించి చర్చలకు వెళ్లాలని కోర్టు చెప్పినా.. కార్మికులు పట్టించుకోవడం లేదని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులతో ఇక చర్చలు లేవని కేసీఆర్ సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. కోర్టులో ప్రభుత్వ వాదనలు బలంగా వినిపించాలని నిర్ణయించారు. సమ్మెతో ఆర్టీసీ తీవ్రంగా నష్టపోయిందని.. భవిష్యత్‌లో సమ్మె మాట వినిపించకుండా చర్యలు తీసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులకు […]

13వ రోజుకు చేరిన ఆర్టీసీ స్ట్రైక్..  కేసీఆర్ కీలక నిర్ణయం
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 17, 2019 | 12:39 PM

ఆర్టీసీ సమ్మె పై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. సమ్మె విరమించి చర్చలకు వెళ్లాలని కోర్టు చెప్పినా.. కార్మికులు పట్టించుకోవడం లేదని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులతో ఇక చర్చలు లేవని కేసీఆర్ సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. కోర్టులో ప్రభుత్వ వాదనలు బలంగా వినిపించాలని నిర్ణయించారు. సమ్మెతో ఆర్టీసీ తీవ్రంగా నష్టపోయిందని.. భవిష్యత్‌లో సమ్మె మాట వినిపించకుండా చర్యలు తీసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఇదే అంశం పై కేసీఆర్ మరోసారి చర్చలు జరపనున్నారు. మంత్రి పువ్వాడ, రవాణా శాఖ అధికారులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. హైకోర్టు ఆదేశం, కార్మికుల సమ్మె పై ప్రధానంగా చర్చ జరపనున్నారు.

ఇదిలా ఉంటే ఆర్టీసీ కార్మికుల సమ్మె 13వ రోజుకి చేరుకుంది. రోజు రోజుకి ఉదృతంగా కొనసాగుతోంది. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్‌లన్నీ కార్మికుల నిరసనలతో దద్దరిల్లుతున్నాయి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బైక్ ర్యాలీలు చేపట్టారు. కోర్టు ఆదేశాన్ని పక్కనపెట్టి.. తాము వెనక్కి తగ్గేది లేదంటూ గళం వినిపిస్తున్నారు. చర్చల తర్వాతే సమ్మె విరమించుకుంటామని తేల్చి చెప్పారు. ఏది ఏమైనా చర్చలకు తాము సిద్దమే అని చెబుతూనే.. సమ్మెను మాత్రం కొనసాగిస్తున్నారు.