Bandi Sanjay: బండి సంజయ్‌కు మరోసారి సిట్ నోటీసులు.. TSPSC పేపర్ లీకేజ్ కేసులో ఆధారాలు ఇవ్వాలంటూ..
టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసు దర్యాప్తును.. సిట్ ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా.. పలువురిని విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రాల లీకేజీ విషయంలో..
టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసు దర్యాప్తును.. సిట్ ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా.. పలువురిని విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రాల లీకేజీ విషయంలో పలు ఆరోపణలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు సిట్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 26న సిట్ ఎదుట హాజరుకావాలని అధికారులు వెల్లడించారు. కాగా, సిట్ అధికారులు బండి సంజయ్‌కు ఇప్పటికే నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే.. పార్లమెంటు సమావేశాలు ఉన్నందున ఈ నెల 24న రాలేనని ఆయన సిట్ అధికారులకు లేఖ రాసి అభ్యర్థించారు. దీంతో బండి సంజయ్ కు మరోసారి నోటీసులు జారీ చేశారు. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ కేసులో ఆధారాలు ఇవ్వాలని సిట్ నోటీసుల్లో తెలిపింది.
ఇదిలాఉంటే.. కాసేపట్లో ఇందిరాపార్క్ దగ్గర బీజేపీ మహాధర్నా ప్రారంభంకానుంది. మా నౌకరీలు మాగ్గావాలే నినాదంతో సర్కార్‌పై నిరసన కార్యక్రమం చేపట్టనుంది. కోర్టు నుంచి పర్మిషన్ రావడంతో ధర్నాచౌక్‌లో బీజేపీ నేతలు నిరసనకు కూర్చోనున్నారు. బండి సంజయ్ సహ పలువురు కీలక నేతలు ఈ ధర్నాలో పాల్గొననున్నారు. కాగా.. 5వందల మందికి మించి పాల్గొనకూడదని కోర్టు ఆంక్షలు విధించి.. ధర్నాకు అనుమతినిచ్చింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..