TSPSC Group-1: ఆ సమయం లోపే చేరుకోవాలి.. గ్రూప్ 1 అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ కీలక సూచనలు
రాష్ట్రంలో 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఈ నెల 11న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా టీఎస్‌పీఎస్సీ పలు కీలక సూచనలు చేసింది. పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి 15 నిమిషాల ముందే పరీక్ష కేంద్రం గేట్లు మూసివేస్తామని తెలిపింది.

రాష్ట్రంలో 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఈ నెల 11న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా టీఎస్‌పీఎస్సీ పలు కీలక సూచనలు చేసింది. పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి 15 నిమిషాల ముందే పరీక్ష కేంద్రం గేట్లు మూసివేస్తామని తెలిపింది. ఉదయం 10.15 AM తర్వాత అభ్యర్థులను ఎవరినీ కూడా అనుమంతించేది లేదని తేల్చి చెప్పింది. అందువల్ల అభ్యర్థులు ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించింది. అలాగే ఓఎంఆర్ పత్రంలో ఎవరైనా తప్పులు చేసినట్లైతే దానికి బదులుగా కొత్తది ఇవ్వలేమని పేర్కొంది.
అలాగే ఓఎంఆర్ పత్రంలో వ్యక్తిగత వివరాలను, సమాధానాలను బ్లూ లేదా బ్లాక్ బాల్‌పాయింట్ పెన్‌తో మాత్రమే సరిగ్గా బబ్లింగ్ చేయాలని తెలిపింది. సరిగ్గా బబ్లింగ్ చేయకపోయినా, పెన్సిల్, ఇంక్‌పెన్, జెల్‌పెన్ ఉపయోగించినా, డబుల్ బబ్లింగ్ చేసినా పత్రాలు చెల్లుబాటు కావని చెప్పింది. అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు ఆధార్, పాన్ కార్డులు, ప్రభుత్వ ఉద్యోగి అయితే దానికి సంబంధించిన గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్సు తదితర ఫొటోతో కూడిన ప్రభుత్వ గుర్తింపుకార్డులు వెంట తీసుకొని రావాలని స్పష్టం చేసింది. ఈ విషయంలో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే వారిపై కేసులు నమోదు చేసి, కమిషన్ నిర్వహించే పరీక్షలు రాయకుండా డిబార్ చేస్తామని హెచ్చరించింది.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
