TS Polycet 2023 Toppers: తెలంగాణ పాలీసెట్ ఫలితాల్లో సూర్యపేట విద్యార్థినికి ఫస్ట్‌ ర్యాంక్‌.. !

Srilakshmi C

Srilakshmi C |

Updated on: May 26, 2023 | 11:48 AM

తెలంగాణ పాలీసెట్‌-2023 ప్రవేశ పరీక్ష ఫలితాలు శుక్రవారం (మే 26) విడుదలయ్యాయి. తాజా ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటారు. సూర్యపేటకు చెందిన సురభి శరణ్య 119 మార్కులతో టాప్‌ ర్యాంక్..

TS Polycet 2023 Toppers: తెలంగాణ పాలీసెట్ ఫలితాల్లో సూర్యపేట విద్యార్థినికి ఫస్ట్‌ ర్యాంక్‌.. !
TS Polycet 2023 Toppers

Follow us on

తెలంగాణ పాలీసెట్‌-2023 ప్రవేశ పరీక్ష ఫలితాలు శుక్రవారం (మే 26) విడుదలయ్యాయి. తాజా ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటారు. సూర్యపేటకు చెందిన సురభి శరణ్య 119 మార్కులతో టాప్‌ ర్యాంక్ సాధించింది. రెండో స్థానంలోనూ సూర్యాపేటకు చెందిన విద్యార్ధి షేక్‌ అబ్బు నిలిచాడు. కాగా మే 17న నిర్వహించిన పాలీసెట్‌ ప్రవేశ పరీక్షకు మొత్తంగా 98.274 మంది విద్యార్ధులు హాజ‌రయ్యారు. ఈ రోజు విడుదలైన పాలీసెట్‌ ఫలితాల్లో మొత్తం 82.7 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 86.63 శాతం పాస్‌ పర్సెంటైల్‌తో బాలికలు మెరిశారు.

తెలంగాణ పాలీసెట్-2023 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పాలీసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాలిటెక్నీక్ కాలేజీలు, ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో న‌డుస్తోన్న పాలిటెక్నిక్ కాలేజీలు, ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ అగ్రిక‌ల్చర్‌ యూనివ‌ర్సిటీ, పీవీ న‌ర్సింహారావు తెలంగాణ యూనివ‌ర్సిటీతో పాటు వీటికి అనుబంధంగా ఉన్న పాలిటెక్నీక్ కోర్సులు అందించే సంస్థల్లో సీట్లను భ‌ర్తీ చేస్తారు. ప్రవేశాలకు సంబంధించి కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ త్వరలో విడుదల చేయనున్నట్లు ఎస్‌బీటీఈటీ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ ఈ సందర్భంగా వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu