Hyderabad: పబ్బుల్లో గబ్బు వదిలిస్తున్న పోలీస్.. డ్రగ్ టెస్టుల్లో ఆరుగురికి పాజిటివ్..!

హైదరాబాద్ మహా నగరంలోని పబ్స్ మీద ఫోకస్ పెట్టారు పోలీసులు. ఒకవైపు ఆపరేషన్ దూల్‌పేట్, మరో వైపు పబ్బుల మీద దాడులు చేస్తూ ఎక్కడికక్కడ మాదక ద్రవ్యాల పై ఉక్కుపాదం మోపుతున్నారు తెలంగాణ పోలీసులు.

Hyderabad: పబ్బుల్లో గబ్బు వదిలిస్తున్న పోలీస్.. డ్రగ్ టెస్టుల్లో ఆరుగురికి పాజిటివ్..!
Pubs Checkings
Follow us
Peddaprolu Jyothi

| Edited By: Balaraju Goud

Updated on: Aug 31, 2024 | 4:04 PM

డ్రగ్స్‌ మత్తులో యువత… ఇప్పుడు చర్చంతా దీనిపైనే..! చిన్న వయసులోనే మత్తు భూతం వారిని కమ్మేస్తోంది. అయితే వారికి తెలియకుండానే డ్రగ్స్‌ టేస్ట్‌ చేస్తున్నారు. డ్రగ్స్ మత్తు నుంచి విశ్వనగరానికి విముక్తి కలిగించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ దూకుడు పెంచింది. ఈ క్రమంలో హైదరాబాద్ మహానగరంలోని పబ్బుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

హైదరాబాద్ మహా నగరంలోని పబ్స్ మీద ఫోకస్ పెట్టారు పోలీసులు. ఒకవైపు ఆపరేషన్ దూల్‌పేట్, మరో వైపు పబ్బుల మీద దాడులు చేస్తూ ఎక్కడికక్కడ మాదక ద్రవ్యాల పై ఉక్కుపాదం మోపుతున్నారు తెలంగాణ పోలీసులు. నిత్యం గంజాయితోపాటు పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంటున్నారు. నగర శివారు ప్రాంతాల్లో రైల్వేస్టేషన్, బస్ స్టాపులు, కాలేజీలు, పబ్స్ అని ఏమాత్రం తేడా లేకుండా ప్రధాన ప్రదేశాలలో తనిఖీలను ముమ్మరం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో టీఎస్ నాబ్ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అర్ధరాత్రి పబ్బులపై దాడులు నిర్వహించారు. హైదరాబాద్ మహానగరం పరిధిలోని మొత్తం 25 పబ్బులలో దాడులు నిర్వహించగా, ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. నిర్ధారణ అయిన వారిలో ఒకరు యువతి కాగా, మిగిలిన వారు యువకులు. నగరంలో పబ్బుల పై ఉక్కుపాదం మోపుతున్నారు టీఎస్ నాబ్ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తాజాగా 25 పబ్బుల పై దాడులు నిర్వహించారు. 130 మందికి డ్రక్ టెస్ట్ పరీక్షలు నిర్వహించగా అందులో ఆరుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది

వీకెండ్స్ కావడంతో పబ్బులపై నిఘా పెట్టిన పోలీసులు, ఈ రైట్స్ నిర్వహించారు. అయితే జీ 40లో ఒకరికి పాజిటివ్ రాగా, క్లబ్ రూప్‌లో ఇద్దరికీ, విస్కీ సాంబాలో ఇద్దరికీ, జోరా పబ్బులో ఒకరికి, మరొక పబ్బులో ఒకరికి చొప్పున డ్రగ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే వీరిని అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు బయట కన్జ్యూమ్ చేసి పబ్‌లోకి వచ్చినట్లుగా గుర్తించారు. వీరికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి. ఎవరి సరఫరా చేశారని దాని మీద వివరాలు రాబడుతున్నారు. గతంలో కూడా గబ్బు లేపుతున్న ఈ పబ్స్ మీద ఎన్నో దాడులు చేసిన తీరు మాత్రం మారడం లేదు.

వీడియో చూడండి..

మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి సహా డ్రగ్‌ దందాపై ఉక్కుపాదం మోపుతున్నారు. టీఎస్ నాబ్ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పక్కా యాక్షన్‌ ప్లాన్‌తో మత్తుబ్యాచ్‌లపై కదలికలపై కన్నేశారు. గీత దాటితే తాట తీసేలా డాగ్‌స్వ్కాడ్‌తో తనిఖీలను మరింత విస్తృతం చేస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..