Free Vegetables: కూరగాయలు ఫ్రీ.. ఎక్కడంటే.! ఒక్కసారిగా ఎగబడ్డ జనం.
పిల్లి పిల్లి కొట్లాడుకుంటే మధ్యలో కోతి వచ్చి రొట్టెను ఎత్తుకెళ్లిన చందంగా మారింది ఓ కూరగాయల మార్కెట్‌లోని వ్యవహారం. హోల్‌సేల్ వ్యాపారులు-రిటైల్ వ్యాపారుల మధ్య తలెత్తిన వివాదం వినియోగదారులకు కలిసి వచ్చింది. హోల్‌సేల్ వ్యాపారుల మీద కోపంతో రిటైల్ వ్యాపారులు కస్టమర్స్‌కి ఫ్రీగా కూరగాయలు పంచి పెట్టారు. అసలే కూరగాయల ధరలు మండిపోతున్న సమయంలో ఇలా ఉచితంగా కూరగాయలు దొరకడంతో.. పెద్ద ఎత్తున పోటెత్తారు కస్టమర్స్.
పిల్లి పిల్లి కొట్లాడుకుంటే మధ్యలో కోతి వచ్చి రొట్టెను ఎత్తుకెళ్లిన చందంగా మారింది ఓ కూరగాయల మార్కెట్‌లోని వ్యవహారం. హోల్‌సేల్ వ్యాపారులు-రిటైల్ వ్యాపారుల మధ్య తలెత్తిన వివాదం వినియోగదారులకు కలిసి వచ్చింది. హోల్‌సేల్ వ్యాపారుల మీద కోపంతో రిటైల్ వ్యాపారులు కస్టమర్స్‌కి ఫ్రీగా కూరగాయలు పంచి పెట్టారు. అసలే కూరగాయల ధరలు మండిపోతున్న సమయంలో ఇలా ఉచితంగా కూరగాయలు దొరకడంతో.. పెద్ద ఎత్తున పోటెత్తారు కస్టమర్స్. ఎవరికి కావలసిన కూరగాయలు వారు సంచిలనిండా వేసుకొని ఫ్రీగా వెళ్లిపోయారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్లో వ్యాపారులు టన్నుల కొద్ది కూరగాయలను ప్రజలకు ఉచితంగా అందజేశారు. ఫ్రీగా కూరగాయలు అందిస్తున్నారని తెలియడంతో ప్రజలు వేలాదిగా తరలివచ్చి సంచులు సంచులుగా కూరగాయలు తీసుకొనివెళ్ళారు. అసలు విషయానికొస్తే …కూరగాయల మార్కెట్లో హోల్‌సేల్, రిటైల్ కూరగాయల వ్యాపారుల మధ్య వివాదం తలెత్తింది. నిబంధనలకు విరుద్ధంగా హోల్‌సేల్ వ్యాపారులు కూరగాయలు విక్రయించడంతో రిటైల్ వ్యాపారులు తిరగబడ్డారు. ఈ క్రమంలో ఇరు వ్యాపారుల మధ్య వివాదం తలెత్తడంతో రిటైల్ వ్యాపారులు ఊహించని నిర్ణయం తీసుకున్నారు. హోల్‌సేల్ వ్యాపారులకు తమదైనశైలిలో బుద్ధి చెప్పాలనుకున్నారు. అంతే కూరగాయలన్నీ వినియోగదారులకు ఫ్రీగా పంచేశారు.
ఒప్పందం ప్రకారం హోల్సేల్ వ్యాపారులు రిటైల్ గా కూరగాయలు అమ్మ వద్దని ఉండగా వారు నిబంధనలు అతిక్రమించి కిలోల చొప్పున కూరగాయలు రోజు మొత్తం అమ్ముతుండడంతో ఆగ్రహించిన రిటెయిల్ వ్యాపారులు కూరగాయలన్నీ ఫ్రీగా పంచిపెట్టారు. అంతేకాదు, ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు కూరగాయలు ఉచితంగా పంపిణి చేస్తూనే ఉంటామని రీటైల్ వ్యాపారులు చెబుతున్నారు. ఈ రెండు వ్యాపార వర్గాల మధ్య తలెత్తిన విభేదాల కారణంగా.. వినియోగదారులు పండగ చేసుకుంటున్నారు. అసలే కూరగాయల ధరలు మండిపోతున్న సమయంలో ఫ్రీగా వస్తుంటే వదిలేస్తారా.. ఉచిత కూరగాయల కోసం తండోపతండాలుగా మార్కెట్ బాటపట్టారు. ఫ్రీగా కూరగాయలను సంచుల్లో నింపుకొని వెళ్తున్నారు. కూరగాయలు కొనుగోలుకు పెద్ద ఎత్తున జనం తరలి వస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.