Maharashtra: మరో దారుణం.. నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ అఘాయిత్యం.!

కోల్‌కతా డాక్టర్‌ హత్యాచార ఘటనపై ఓవైపు విచారణ జరుగుతోంది. మరోవైపు దేశవ్యాప్తంగా మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలపై నిరసనలు, ధర్నాలు జరుగుతున్నాయి. పని ప్రదేశంలో మహిళలకు రక్షణ కల్పించాలంటూ వైద్యులు, నర్సులు ఆందోళనలు చేస్తున్నారు. అయినా కామాంధులు ఖాతరు చేయడంలేదు. మీపని మీదే.. మాపని మాదే అన్నట్టుగా రెచ్చిపోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా రోజుకో అత్యాచార ఘటన వెలుగులోకి వస్తోంది.

Maharashtra: మరో దారుణం.. నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ అఘాయిత్యం.!

|

Updated on: Aug 31, 2024 | 4:16 PM

కోల్‌కతా డాక్టర్‌ హత్యాచార ఘటనపై ఓవైపు విచారణ జరుగుతోంది. మరోవైపు దేశవ్యాప్తంగా మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలపై నిరసనలు, ధర్నాలు జరుగుతున్నాయి. పని ప్రదేశంలో మహిళలకు రక్షణ కల్పించాలంటూ వైద్యులు, నర్సులు ఆందోళనలు చేస్తున్నారు. అయినా కామాంధులు ఖాతరు చేయడంలేదు. మీపని మీదే.. మాపని మాదే అన్నట్టుగా రెచ్చిపోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా రోజుకో అత్యాచార ఘటన వెలుగులోకి వస్తోంది. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ బాలికో, వృద్ధురాలో, యువతో ఎవరో ఒకరు కామ పిశాచులకు బలైపోతున్నారు. తాజాగా మహారాష్ట్రలో మరో దారుణం జరిగింది. నర్సింగ్‌ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ ఆటో డ్రైవర్‌. కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచారం ఘటన తర్వాత లైంగిక దాడులను ఆపేందుకు కఠిన చట్టాలు తీసుకురావాలని పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. అయినప్పటికీ మహిళలపై అరాచకాలు ఆగట్లేదు. తాజాగా మహారాష్ట్రలో నర్సింగ్‌ విద్యార్థినిపై ఓ ఆటోడ్రైవర్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మహారాష్ట్రలోని రత్నగిరిలో నర్సింగ్ చదువుతున్న 20 ఏళ్ల విద్యార్థిని తరగతులకు హాజరైన అనంతరం ఇంటికి వెళ్లడానికి ఆటో ఎక్కింది. ఆమెతో మాటలు కలిపిన డ్రైవర్‌ తాగడానికి నీళ్లు ఇచ్చాడు. అప్పటికే అందులో అతడు మత్తుమందు కలపడంతో యువతి స్పృహ కోల్పోయింది. అనంతరం ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లిన డ్రైవర్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు. అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర గాయాలతో, అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలిని గమనించిన స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. కొంత సేపటికి స్పృహ రావడంతో తనపై లైంగిక దాడి జరిగినట్లుగా గుర్తించిన బాధితురాలు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసింది. వారు పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడిని త్వరగా అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ బాధితురాలి బంధువులు, స్థానికులు, డాక్టర్లు, నర్సులు అర్ధరాత్రి రోడ్డుపై పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us