Viral: రైలు పట్టాలపై గొడుగు వేసుకొని మరీ నిద్రపోయిన వ్యక్తి.. చూస్తే షాకవుతారు.!

Viral: రైలు పట్టాలపై గొడుగు వేసుకొని మరీ నిద్రపోయిన వ్యక్తి.. చూస్తే షాకవుతారు.!

Anil kumar poka

|

Updated on: Aug 31, 2024 | 3:39 PM

ఓ వ్యక్తి ఎక్కడా చోటు లేనట్టు గొడుగు వేసుకొని మరీ రైలు పట్టాలపై గుర్రుపెట్టి మరీ నిద్రపోయాడు. ఇంతలో ఆ ట్రాక్‌పై రైలు వచ్చింది. రైలు పట్టాలపై గొడుగు, దానికింద ఓ వ్యక్తి కనిపించడంతో అప్రమత్తమైన లోకోపైలట్‌ రైలును ఆపి వేశాడు. వెంటనే రైలు దిగి వెళ్లి అతన్ని నిద్రలేపి పక్కకు వెళ్లమని చెప్పాడు. అతను పక్కకు వెళ్లాక తిరిగి రైలు అక్కడ్నుంచి కదిలింది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఓ వ్యక్తి ఎక్కడా చోటు లేనట్టు గొడుగు వేసుకొని మరీ రైలు పట్టాలపై గుర్రుపెట్టి మరీ నిద్రపోయాడు. ఇంతలో ఆ ట్రాక్‌పై రైలు వచ్చింది. రైలు పట్టాలపై గొడుగు, దానికింద ఓ వ్యక్తి కనిపించడంతో అప్రమత్తమైన లోకోపైలట్‌ రైలును ఆపి వేశాడు. వెంటనే రైలు దిగి వెళ్లి అతన్ని నిద్రలేపి పక్కకు వెళ్లమని చెప్పాడు. అతను పక్కకు వెళ్లాక తిరిగి రైలు అక్కడ్నుంచి కదిలింది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో చిన్నగా వర్షం పడుతోంది. ఓ వ్యక్తి అప్పటి వరకూ పనిచేసి అలిసి పోయి నిద్రపోయాడో, లేక మద్యం సేవించి మత్తులో అలా చేశాడో కానీ.. అతను ఎంచక్కా గొడుగు వేసుకొని రైలు పట్టాలపై పడుకొని కునుకు తీసాడు. రైలు పట్టాలపై తల పెట్టి మధ్యలో పడుకున్నాడు. అదే ట్రాక్‌పై ఓ రైలు దూసుకొచ్చింది. రైలు పట్టాలపై కనిపించిన దృశ్యాన్ని గమనించిన లోకో పైలట్‌ రైలును నిలిపివేశాడు. ఇంజన్‌ నుంచి కిందకు దిగి ఆ వ్యక్తి వద్దకు వచ్చాడు. మంచి నిద్రలో ఉన్న అతడ్ని తట్టి లేపాడు. రైలు పట్టాల నుంచి పక్కకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆ రైలు అక్కడి నుంచి కదిలి వెళ్లింది. మరోవైపు ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ఆ వ్యక్తి చనిపోయే ఉద్దేశంతో రైలు పట్టాలపై పడుకున్నట్లుగా లేదని కొందరు అభిప్రాయపడితే… అతడు పిచ్చివాడై ఉంటాడని మరికొందరు భావించారు. మద్యం మత్తులో రైలు పట్టాలపై నిద్రించి ఉంటాడని ఇంకొందరు మండిపడ్డారు. ఆ వ్యక్తిపై తగిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్‌ చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.