Telangana DSC: తెలంగాణ డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్‌.. ‘కీ’ పేపర్ వచ్చేసింది..

తెలంగాణలో డీఎస్సీ పరీక్షకు హాజరైన అభ్యర్థులకు అలర్ట్‌. ఇటీవల నిర్వహించిన ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని విడుదల చేశారు. అధికారులు వెబ్‌సైట్‌లో ఈ ప్రాథమిక కీని విడుదల చేశారు. ప్రిలిమినరీ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్‌ సీట్లను అధికారులు ఆన్‌లైన్‌లో అభ్యర్థుల కోసం అందుబాటులో ఉంచారు....

Telangana DSC: తెలంగాణ డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్‌..  'కీ' పేపర్ వచ్చేసింది..
TG DSC
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 13, 2024 | 6:08 PM

తెలంగాణలో డీఎస్సీ పరీక్షకు హాజరైన అభ్యర్థులకు అలర్ట్‌. ఇటీవల నిర్వహించిన ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని విడుదల చేశారు. అధికారులు వెబ్‌సైట్‌లో ఈ ప్రాథమిక కీని విడుదల చేశారు. ప్రిలిమినరీ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్‌ సీట్లను అధికారులు ఆన్‌లైన్‌లో అభ్యర్థుల కోసం అందుబాటులో ఉంచారు. ప్రిలిమనరీ కీతో పాటు, అభ్యర్థుల రెస్పాన్స్‌ షీట్లను విడుదల చేశారు.

ఈ ప్రాథమిక కీపై ఏమైన అభ్యంతరాలు ఉంటే అభ్యర్థులు ఆన్‌లైన్‌లో తెలియజేయాలని అధికారులు తెలిపారు. అభ్యంతరాల పరిశీలన అనంతరం ఏవైనా మార్పులు ఉంటే తెలియజేస్తారు. ఇదిలా ఉంటే తెలంగాణలో 11,062 ఉపాధ్యాయుల పోస్టులకుగాను ప్రభుత్వం ఆన్‌లైన్‌ పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. జులై 18వ తేదీన మొదలైన ఈ పరీక్ష దశలవారీగా ఆగస్టు 5వ తేదీన ముగిసిన విషయం తెలిసిందే.

11,062 పోస్టులకు మొత్తం 2,79,957 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 2,45,263 మంది హాజరయ్యారు. దరఖాస్తు చేసుకున్న వారిలో 34,694 మంది పరీక్షలకు హాజరుకాలేదు. అత్యధికంగా సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పోస్టులకు 92.10 శాతం హాజరయ్యారు. డీఎస్సీ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు టీజీపీఎస్సీ కమిషన్‌ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కీతోపాటు, రెస్పాన్స్‌ షీట్లను పొందొచ్చు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..