TGSRTC: బస్సు డ్రైవర్‌ను సన్మానించిన ఆర్టీసీ ఎండీ.. ఇంతకీ ఏం చేశారనేగా..

అయితే హైదరాబాద్‌ శివారులోని ఘట్‌కేసర్‌ దాటగానే బస్సులో ప్రయాణిస్తున్న సంతోష్‌ అనే వ్యక్తికి ఒక్కసారిగా ఫిట్స్‌ వచ్చింది. దీంతో తోటి ప్రయాణికులంతా ఒక్కసారిగా ఆందోళన చెందారు. ఈ విషయాన్ని బస్సు డ్రైవర్‌ బి. వెంకన్నకు తెలియజేశారు. వెంటనే బస్సును పక్కకు ఆపిన వెంకన్న ఫిట్స్‌ వచ్చిన వ్యక్తిని పరిశీలించారు. సంతోష్‌ ఆరోగ్య పరిస్థితి...

TGSRTC: బస్సు డ్రైవర్‌ను సన్మానించిన ఆర్టీసీ ఎండీ.. ఇంతకీ ఏం చేశారనేగా..
TGRTC
Follow us

|

Updated on: Aug 13, 2024 | 5:32 PM

తెలంగాణ ఆర్టీసీకి చెందిన డ్రైవర్‌ చేసిన పనికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సన్మానం చేశారు. సమయస్ఫూర్తితో స్పందించి, ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన ఆ డ్రైవర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ ఎవరతను.? ఏం చేశాడో తెలియాంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. వరంగల్‌2 డిపోకు చెందిన సూపర్‌ లగ్జరీ బస్సు సోమవారం హైదరాబాద్ నుంచి హన్మకొండ బయలు దేరింది.

అయితే హైదరాబాద్‌ శివారులోని ఘట్‌కేసర్‌ దాటగానే బస్సులో ప్రయాణిస్తున్న సంతోష్‌ అనే వ్యక్తికి ఒక్కసారిగా ఫిట్స్‌ వచ్చింది. దీంతో తోటి ప్రయాణికులంతా ఒక్కసారిగా ఆందోళన చెందారు. ఈ విషయాన్ని బస్సు డ్రైవర్‌ బి. వెంకన్నకు తెలియజేశారు. వెంటనే బస్సును పక్కకు ఆపిన వెంకన్న ఫిట్స్‌ వచ్చిన వ్యక్తిని పరిశీలించారు. సంతోష్‌ ఆరోగ్య పరిస్థితి విషమిస్తుందని గమనించిన వెంకన్న క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే బస్‌ను ఆన్‌ చేశాడు.

మరో తోటి ప్రయాణికుడు శ్రీనివాస్‌ సహకారంతో బస్సును హుటాహుటిన బీబీ నగర్‌లోని ఎయిమ్స్ ఆస్పత్రికి తీసుళ్లాడు. వెంటనే సంతోష్‌ను ఆసుపత్రిలో చేర్పించారు. సకాలంలో ఆసుపత్రికి తీసుకురావడంతో సంతోష్‌కు ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. సమయస్పూర్తితో స్పందించి.. సకాలంలో ప్ర‌యాణికుడిని ఆస్ప‌త్రికి తీసుకెళ్లిన ఆర్టీసీ డ్రైవ‌ర్ బి.వెంక‌న్నను హైద‌రాబాద్ బ‌స్ భ‌వ‌న్‌లో మంగ‌ళ‌వారం టీజీఎస్ఆర్టీసీ యాజ‌మాన్యం అభినందించింది. సంస్థ ఉన్న‌తాధికారుల‌తో క‌లిసి ఆయ‌న‌ను టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌న‌ర్, ఐపీఎస్ స‌న్మానించారు.

ఆపద సమయంలో అమూల్య‌మైన సేవాత‌ర్ప‌ర‌త‌ను ఆర్టీసీ సిబ్బంది చాటుతున్నార‌ని స‌జ్జ‌న‌ర్ ఈ సందర్భంగా అన్నారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు.. వారికి ఆపద సమయంలో తాము ఉన్నామని భరోసా కల్పిస్తున్నార‌ని ప్రశంసించారు. సంతోష్‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించడంలో డ్రైవ‌ర్‌కి స‌హ‌క‌రించిన ప్ర‌యాణికుడు శ్రీనివాస్‌కు, వైద్యం అందించిన ఎయిమ్స్ వైద్య బృందానికి అభినంద‌న‌లు తెలియ‌జేశారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి…