TS Advocates JAC: వామన్ రావు దంపతుల కేసులో వారందరినీ అరెస్ట్ చేయాలి.. తెలంగాణ అడ్వకేట్ జేఏసీ డిమాండ్..
TS Advocates JAC: వామన్ రావు దంపతులు దారుణ హత్యపై తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ జేఏసీ నాయకులు తీవ్రంగా స్పందించారు. శనివారం నాడు పెద్దపల్లి జిల్లా మంథని కోర్టు..
TS Advocates JAC: వామన్ రావు దంపతులు దారుణ హత్యపై తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ జేఏసీ నాయకులు తీవ్రంగా స్పందించారు. శనివారం నాడు పెద్దపల్లి జిల్లా మంథని కోర్టు ఆవరణలో తెలంగాణ హైకోర్టు న్యాయవాదులు, రాష్ట్ర అడ్వకేట్ జేఏసీ నాయకులు మీడియా సమావేశం పెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన వారు.. న్యాయవాదులై గట్టు వామన్ రావు దంపతుల హత్యను తీవ్రంగా ఖండించారు. ఈ హత్యలను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీరి హత్యపై సీబీసీఐడీ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. స్థానిక పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని, సీపీ సత్యనారాయణను వెంటనే సస్పెండ్ చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. గట్టు వామన్ రావు చనిపోతూ రెండు పేర్లను వెల్లడించగా.. ఒకరిని మాత్రమే అరెస్ట్ చేసి చూపించడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ కేసులో నిందితులందిరినీ అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే చనిపోయిన గట్టు వామన్ రావు, నాగమణి కుటుంబానికి రూ. ఐదు కోట్ల పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు న్యాయవాదులు, రాష్ట్ర అడ్వకేట్ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.
Also read:
ఉత్తరాఖండ్ ఉత్పాతం, రంగు మారిన అలకానంద నది నీరు, మరికొన్ని రోజుల పాటు సేమ్ సీన్ !