‘ఆర్ఆర్ఆర్’ సెట్లో పవన్ ప్రత్యక్షం, తన షూట్ బ్రేక్‌లో నేరుగా RRR సెట్లోకి వెళ్లిన పవర్ స్టార్

ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతోన్న ఆర్ఆర్ఆర్' సెట్లో సెడెన్ గా పవన్ ప్రత్యక్షమయ్యారు. తన షూట్ బ్రేక్‌లో నేరుగా RRR..

'ఆర్ఆర్ఆర్' సెట్లో పవన్ ప్రత్యక్షం, తన షూట్ బ్రేక్‌లో నేరుగా RRR సెట్లోకి వెళ్లిన పవర్ స్టార్
Follow us
Venkata Narayana

|

Updated on: Feb 20, 2021 | 4:07 PM

ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతోన్న ఆర్ఆర్ఆర్’ సెట్లో సెడెన్ గా పవన్ ప్రత్యక్షమయ్యారు. తన షూట్ బ్రేక్‌లో నేరుగా RRR సెట్లోకి వెళ్లిన పవర్ స్టార్, జక్కన్న రాజమౌళి, ఎన్టీఆర్ ఇద్దరితో మాటామంతి చేశారు. ఈ సందర్భంగా పవన్‌కు ‘త్రిబుల్‌ఆర్’ షూటింగ్ విశేషాలు, మూవీ రషస్ ను దగ్గరుండి చూపించారు దర్శకుడు రాజమౌళి. క్లైమాక్స్ చిత్రీకరణ చేస్తున్న సెట్ ను పవన్ పరిశీలించారు. అల్యూమినియం ఫ్యాక్టరీలోనే పవన్ సినిమా షూటింగ్ కూడా జరుగుతుండటంతో పవన్ మర్యాదపూర్వకంగా ఆర్ఆర్ఆర్ టీంను పలకరించారు.

కాగా, ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ లో పవన్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. మరిన్ని రోజులు పవన్ షూటింగ్ అక్కడే జరుగనుంది. ప్రస్తుతం పవన్ మీద ఫైట్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం:12గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. దీంతోపాటే క్రిష్ సినిమా చిత్రీకరణలో కూడ పాల్గొంటారు పవన్. ప్రస్తుతం కొత్త షెడ్యూల్ కోసం 17వ శతాబ్దం నాటి చార్మినార్ సెట్ రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.

Read also :  దబిడి దిబిడైన సర్కారు లెక్క, అంచనాలకు సిండికేట్ అడ్డం, హైదరాబాద్‌లో లాటరీ ద్వారా 55 కొత్త బార్‌లు కేటాయింపు