‘దృశ్యం 2’ను వదలని పైరసీ భూతం… రిలీజ్ అయిన గంటల్లోనే తమిళ్ రాకర్స్‏లో మోహన్ లాల్ సినిమా..

ఆరు సంవత్సరాల క్రితం మలయాళంలో సెన్సెషనల్ హిట్ సాధించిన సినిమా దృశ్యం. ఈ మూవీ తెలుగు, తమిళంతోపాటు మరో

'దృశ్యం 2'ను వదలని పైరసీ భూతం... రిలీజ్ అయిన గంటల్లోనే  తమిళ్ రాకర్స్‏లో  మోహన్ లాల్ సినిమా..
Follow us

|

Updated on: Feb 20, 2021 | 3:48 PM

ఆరు సంవత్సరాల క్రితం మలయాళంలో సెన్సెషనల్ హిట్ సాధించిన సినిమా దృశ్యం. ఈ మూవీ తెలుగు, తమిళంతోపాటు మరో మూడు భాషల్లో రీమేక్ అయ్యి.. అక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది. తాజాగా ఈ సినిమా సిక్వెల్‏ను మరోసారి మలయాళంలో తెరకెక్కించారు. మలయాళ స్టార్ మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రలో నటించగా.. జీతు జోసెఫ్ దర్శకత్వం వహించాడు. ఫిబ్రవరి 19న ఈ మూవీని అమెజాన్ ప్రైమ్‏లో విడుదల చేశారు. దాదాపు ఈ సినిమాను రూ.50 కోట్ల బడ్జెట్‏తో తెరెకెక్కించారు.

మోహాన్ లాల్ ప్రధాన పాత్రలో వచ్చిన దృశ్యం 2 సినిమాకు కూడా లీకర్స్ బాధ తప్పలేదు. ఈ మూవీని తమిళ్ రాకర్స్ అనే పైరసీ వెబ్ సైట్ లీక్ చేసింది. ఈ వెబ్ సైట్ చాలా సంవత్సరాల నుంచి అటు వెండితెరను.. ఇటు బుల్లితెరకు సంబంధించిన పలు విషయాలను లీక్ చేస్తూ వస్తుంది. ఇక ఈ మూవీ ఇతర వెబ్ సైట్స్‏లో కూడా చూడటానికి మరియు డౌన్ లోడ్ చేసుకోవడానికి వీలవుతుంది.

ఈ క్రమంలో ఓ ఇంగ్లీష్ పేపర్‏కు ఇచ్చిన ఇంటర్వులో డైరెక్టర్ జోసెఫ్ మాట్లాడుతూ.. మొదటి సినిమాలో చూపించిన సంఘటనల తర్వాత దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత దానికి సిక్వెల్ విడుదల చేసాం. కుటుంబానికి కలిగిన ఆ సమస్య తర్వాత వారి జీవితం ఎలా సాగింది అనేది ఈ సినిమా అంటూ చెప్పుకోచ్చారు. పోలీసులు హత్య దర్యాప్తును క్లోజ్ చేయకుండా.. ఆ కుటుంబానికి తెలియకుండా కేసును ఛేదిస్తూంటారు. ఈ క్రమంలో పోలీసులకు ధీటుగా ఆ కుటుంబం ఎలాంటి ప్లాన్స్ వేస్తుంది అనేది ఇందులో చూడోచ్చు అంటూ తెలిపారు. తాజాగా విడుదలైన సినిమాలో ప్రారంభంలోనే ఆ హత్య కేసుతో కుటుంబం కనిపించడం మొదలైవుతుంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా హత్యా కేసు నుంచి తప్పించుకుంటున్న కుటుంబం.. మళ్లీ తెరపైకి రావడం.. ఆ కేసు రీఓపెన్ కావడం.. సాక్ష్యులు, వారి వాంగ్మూలాలు రికార్టు చేయడం.. కుటుంబానికి మళ్లీ ఆ కేసు చుట్టుకోవడం ఇలాంటి ట్విస్టులతో కూడి ఉంటుంది. తాజాగా విడుదలైన విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది ఈ సినిమా. కాగా ఈ మూవీ చైనీస్ మరియు సింహాళీస్ అనే రెండు భాషలలో రీమేక్ అయ్యింది.

అయితే ఈ సినిమా పైరసీ వెబ్ సైట్ లో లీక్ మేకర్స్ తోపాటు ప్రైమ్ వీడియోకు గట్టి దెబ్బతీసింది. గతంలో కూడా ఇలాంటి పైరసీ వెబ్ సైట్లు ప్రీమియం కంటెంట్‏ను విడుదల చేసి డౌన్ లోడ్ ఆప్షన్ అందించాయి. ఇలాంటి వెబ్ సైట్స్ పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ.. అధికారింగా విడుదలైన తాండవ్, ఆశ్రమం 2, లూడో మరియు చలాంగ్ సినిమాలు లీకయ్యాయి. తమిళ్ రాకర్స్ కు సంబంధించినంతవరకు ఈ వెబ్ సైట్ గతంలో అనేక సార్లు బ్లాక్ చేశారు. తాజాగా డొమైన్ పేరుతో మరో వెబ్ సైట్ క్రియేట్ చేసి… సినిమాలను లీక్ చేస్తున్నరారు.

Also Read:

Mahesh Babu: సూపర్‌స్టార్ ఆ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాడు.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన పర్సనల్ ట్రైనర్..