Bell Bottom movie : రా ఏజంట్ గా రానున్న ఖిలాడి హీరో.. అక్షయ్ బెల్ బాటమ్ రిలీజ్ డేట్ ఫిక్స్ ..
అక్షయ్ హీరోగా రంజిత్ ఎం.తివారీ దర్శకత్వంలో వషు భగ్నానీ, జాకీ భగ్నానీ, దీప్‌శిక్షా దేశ్‌ముఖ్, మోనిషా అద్వానీ, మధు బోజ్వానీ, నిఖిల్ అద్వానీ నిర్మించిన చిత్రం ‘బెల్‌బాటమ్’.
Akshay Kumar Bell Bottom : అక్షయ్ హీరోగా రంజిత్ ఎం.తివారీ దర్శకత్వంలో వషు భగ్నానీ, జాకీ భగ్నానీ, దీప్‌శిక్షా దేశ్‌ముఖ్, మోనిషా అద్వానీ, మధు బోజ్వానీ, నిఖిల్ అద్వానీ నిర్మించిన చిత్రం ‘బెల్‌బాటమ్’. వాణీ కపూర్, లారాదత్తా, హూమాఖురేషి హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రం 1980 బ్యాక్‌డ్రాప్‌లో రూపొందింది.కాగా ఈ సినిమాకోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కరోనా అడ్డురాకుండా ఉండిఉంటే ఈ మూవీ ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు వచ్చేది.
ఇందులో అక్షయ్ రా ఏజెంట్‌గా కనిపించనున్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలో షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకొని రిలీజ్ కు సిద్ధమైంది.అయితే ఈ సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేస్తారని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ ప్రచారాలకు తెరదించుతూ.. చిత్రయూనిట్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది. మే 28న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాతోపాటు ‘పృథ్వీరాజ్ అట్రాంగి రే బచ్చన్ పాండే ఇంకా ‘రామ్ సేతు’ సినిమాలు చేస్తున్నాడు.
మరిన్ని ఇక్కడ చదవండి :
Naandhi Movie: ఇలాంటి సినిమా కోసం ఎనిమిదేళ్లు పట్టింది.. కన్నీళ్లు పెట్టుకున్న అల్లరి నరేష్