Water Filters: స్వచ్ఛమైన తాగునీరు కోసం విద్యార్థుల ముందడుగు.. 100 కుటుంబాలకు వాటర్ ఫిల్టర్ పంపిణీ
హైదరాబాద్‌లోని రసూల్‌పురా మురికి వాడలో నివసిస్తున్న వారికి స్వచ్ఛమైన నీరు అందించేందుకు ఇంటర్మీడియేట్ విద్యార్థులు ముందుకు వచ్చారు. విద్యార్థి జయంత్‌తో పాటు అతని..
Water Filters: హైదరాబాద్‌లోని రసూల్‌పురా మురికి వాడలో నివసిస్తున్న వారికి స్వచ్ఛమైన నీరు అందించేందుకు ఇంటర్మీడియేట్ విద్యార్థులు ముందుకు వచ్చారు. విద్యార్థి జయంత్‌తో పాటు అతని స్నేహితులు కలిసి శుద్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. నయానిర్మాణలో భాగంగా 100 కుటుంబాలకు వాటర్ ఫిల్టర్లను అందజేశారు. అయితే కనీసం వెయ్యి మందికి ఈ వాటర్ ఫిల్టర్‌లను అందించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే తాగునీరు కలుషితంగా ఉండటంతో రోగాలు దరి చేరుతున్నాయని, దీంతో వారికి స్వచ్ఛమైన నీటిని అందించేందుకు శుభ్రమైన తాగునీటి అందించేందుకు ఈ వాటర్ ఫిల్టర్ల పంపిణీ ప్రాజెక్టును చేపట్టినట్లు వారు పేర్కొన్నారు. అయితే భారతదేశ జనాభాలో 50 శాతం కన్నా తక్కువ మందికి మాత్రమే స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉంది.
అందులో రసూల్‌పురా నివాసితులు కూడా ఉన్నారు. ఎక్కువగా వాటర్ పైప్‌లైన్లు పగిలిపోవడం, తాగునీరు కలుషితం కావడం జరుగుతూనే ఉంది. నీటిని శుద్ది చేసేందుకు అందులో క్లోరిన్ కలపడం జరుగుతుంది. ఇలా నాలుగైదు రోజులకోసారి మాత్రమే వారికి తాగునీరు లభిస్తుంది. అయినా ఈ నీరు వారికి సురక్షితం కాదని చెబుతున్నారు. అయితే జయంత్ అనే విద్యార్థితో పాటు మరి కొందరు విద్యార్థులు కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మురికివాడలకు వాటర్ ఫిల్టర్ అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. అయితే వారికి మంచినీరు అందాలనే ఉద్దేశంతో ఈ విద్యార్థుల బృందం సోషల్ మీడియా ద్వారా ప్రచారం నిర్వహించారు. పది రోజుల వ్యవధిలోనే రూ.1.5 లక్షలను సేకరించారు. ఐదుగురు ఉన్న కుటుంబానికి రెండు రోజుల వరకు సురక్షితమైన తాగునీరు అందించగల 16 లీటర్ల సామర్థ్యం కలిగిన ఫిల్టర్‌లను ఈ బృందం కొనుగోలు చేసి అందిస్తోంది.
అక్కడి చెరువులో వింత.. తెల్లగా ఉండే హంసలు నల్లగా మారుతున్నాయి.. అసలు కారణం ఎంటంటే..