AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్కడి చెరువులో వింత.. తెల్లగా ఉండే హంసలు నల్లగా మారుతున్నాయి.. అసలు కారణం ఎంటంటే..

సాధారణంగా హంసలు తెలుపు రంగులో ఉంటాయనే విషయం తెలిసిందే. కానీ ఇంగ్లాండులోని విల్డ్ షైర్‏లో ఒక హంస మాత్రం నలుపు రంగులో ఉంది.

అక్కడి చెరువులో వింత.. తెల్లగా ఉండే హంసలు నల్లగా మారుతున్నాయి.. అసలు కారణం ఎంటంటే..
Rajitha Chanti
|

Updated on: Feb 20, 2021 | 6:02 PM

Share

సాధారణంగా హంసలు తెలుపు రంగులో ఉంటాయనే విషయం తెలిసిందే. కానీ ఇంగ్లాండులోని విల్డ్ షైర్‏లో ఒక హంస మాత్రం నలుపు రంగులో ఉంది. ప్రస్తుతం ఆ హంసను చూసినవారందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే ఈ హంస ఇలా మారడానికి కారణం చెరువులో ఏదైనా తెలియని పదార్థం వేసారెమో అని అనుమానిస్తుంది RSPCA. నలుపు రంగులో ఉన్న మ్యూట్ హాంసను వెస్ట్ బరీలోని చెరువులో దీనిని రక్షించారు. దానిని RSPCA వెస్ట్ హాచ్‏కు తీసుకెళ్లారు. అక్కడి సిబ్బంది దీనిని చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు. RSPCA హంసను రక్షించినప్పటి నుంచి అది అలా మారడానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. హంసను పెద్ద నీటి తొట్టిలో వేసి జాగ్రత్తగా శుభ్రం చేశారు. RSPCA ఇన్‏స్పెక్టర్ స్టెఫ్ డాలీ మాట్లాడుతూ.. మొదటి ఈ నల్లటి హంసను చూసి తాను భయపడ్డానని.. కానీ అది అలా మారడానికి గల కారణం తెలుసుకోవడానికి చాలా కాలం పట్టిందని తెలిపారు. శనివారం ఆ బాతును రక్షించడానికి ముందు అది దాని రంగును వదిలించుకోవడానికి చాలాగా ఇబ్బంది పడిందని చెప్పుకోచ్చారు. ముందుగా ఈ హంసను చూసి.. మొదట్లో నూనె అనుకున్నాము.. కానీ ఈ పదార్థం ఫోటోకాపియర్ ఇంక్ టోనర్ మాదిరిగానే ఎక్కువగా పొడిగా ఉంటుంది. దానిని శుభ్రం చేయడం శ్రమతో కూడుకున్నదని తెలిపారు. హంసను శుభ్రం చేయడానికి దాదాపు 30 నిమిషాల సమయం తీసుకుంటుందని చెప్పారు. జంతువులను రక్షించడానికి ఫెయిరీ లిక్విడ్ అధిక మొత్తంలో అవసరం పడుతుందని జంతు రెస్క్యూ సెంటర్ సిబ్బంది తెలిపారు. వెస్ట్ హాచ్ RSPCA డిష్ వాషింగ్ ఆ ద్రవం కోసం విరాళాలు అవసరం పడతాయని తెలిపారు. హంసను శుభ్రం చేయడానికి కేవలం ఫెయిరీని మాత్రమే ఉపయోగపడుతుందని తెలిపారు.

ఎవరైన నల్లటి పక్షులను గుర్తిస్తే వెంటనే వారికి సమాచారం ఇవ్వాలని తెలిపారు. అయితే ఒక హంసను శుభ్రం చేయాలంటే చాలా సార్లు దానిని వాష్ చేయాల్సి వస్తుందని.. దానిని శుభ్రం చేసే సమయంలో మేము దానికి ఎలాంటి ఆహారం ఇవ్వలేమని దీంతో అది చాలా నీరసంగా అవుతుందని భయపడ్డామని.. కానీ అలాంటి పరిస్థితి రాకముందే శుభ్రం చేసినట్లుగా తెలిపారు. కాలుష్యం ఎక్కువగా ఉన్నందున ఆ పరిస్థితి మరింతే పెరిగే అవకాశం లేదని పర్వావరణ సంస్థ తెలిపింది. ఆ పదార్థాన్ని తొలగించకపోతే వాటర్ బర్డ్స్ యొక్క ప్లూమేజ్‏లో సహజ వాటర్ ప్రూఫింగ్ తగ్గుతుంది. దీంతో అవి చనిపోయే ప్రమాదం ఉందని తెలిపింది.

Also Read:

‘స్ట్రాబెర్రీ బిర్యానీ’ గురించి మీకు తెలుసా ? నెట్టింట్లో వైరల్ అవుతున్న ఫోటోలు.. ఎవరు చేశారంటే..