Watch: లైవ్ రిపోర్టింగ్‌లో ఫన్నీ దోపిడీ.. షాక్‌లో యాంకర్.. నవ్వులు పూయిస్తున్న వైరల్ వీడియో.!
Viral Video Live Robbery: సీరియస్‌గా రిపోర్టింగ్ చేస్తున్న సమయంలో సడెన్‌గా గుర్తుతెలియని వ్యక్తి వచ్చి మిమ్మల్ని డిస్టబ్ చేస్తే.. ఎక్కడల్లేని..
Viral Video Live Robbery: సీరియస్‌గా రిపోర్టింగ్ చేస్తున్న సమయంలో సడెన్‌గా గుర్తుతెలియని వ్యక్తి వచ్చి మిమ్మల్ని డిస్టబ్ చేస్తే.. ఎక్కడల్లేని.. కోపం వస్తుంది. ఇంకొన్ని సార్లు అయితే.. కొందరు ఆకతాయి కుర్రాళ్లు.. లైవ్ రిపోర్టింగ్ చేస్తుంటే.. సిల్లిగా.. లేడీ రిపోర్టర్‌కు కిస్ పెట్టి మరీ జారుకుంటారు. ఇలా.. రిపోర్టర్లను.. నానా రకాలుగా ఆడుకుంటే.. అదో రకం ఎంజాయ్ అనుకుంటారు. ఇప్పుడు.. ఇలాంటి సంఘటనే.. తాజాగా మరొకటి జరిగింది. కానీ.. ఇక్కడ రిపోర్టర్ అమ్మాయి కాదు.. కిస్‌లు పెట్టడాలులాంటి లేవు. మరి ఇంకేమైందని అంటారు. ఆ మ్యాటర్ ఏంటో మీరే చూడండి.
రిపోర్టర్ లైవ్ ఇస్తుండగా.. ఓ దుండగుడు తుపాకీతో బెదిరించి దోపిడీకి పాల్పడిన ఘటన ఈక్వెడార్‌లో చోటుచేసుకుంది. ఈ నెల 12న ఈక్వెడార్‌లోని ఓ ఫుట్‌బాల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌కు సంబంధించి డైరెక్టివి స్పోర్ట్స్ ఛానల్‌కు చెందిన జర్నలిస్ట్ డియెగో ఆర్డినోలా లైవ్ రిపోర్టింగ్ చేస్తున్నారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన దుండగుడు రిపోర్టర్‌తో పాటు సిబ్బందిని తుపాకీతో బెదిరించి వారి వద్ద ఉన్న ఫోన్లు, డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో భయపడిపోయిన సిబ్బంది ఒకరు తన వద్ద ఉన్న వస్తువులను ఇచ్చేయడంతో, అవి తీసుకొని దుండగుడు అక్కడి నుంచి మెల్లిగా జారుకున్నాడు. అయితే ఈ తతంగం అంతా.. లైవ్ రిపోర్టింగ్ చేస్తున్న సమయంలోనే జరగాదంతో.. వ్యవహారాన్ని చూసిన నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Also Read: భార్య చిలిపి ముద్దు.. ఆగ్రహించిన భర్త.! జూమ్ మీట్‌లో ఫన్నీ రొమాన్స్.. నెటిజన్లు ఫిదా..