కేంద్ర బిల్లులను వ్యతిరేకిస్తాం : టీఆర్ఎస్ ఎంపీలు

మోదీ సర్కారు రాష్ట్రాల హక్కులను హరించేలా వ్యవహరిస్తోందని టీఆర్ఎస్ ఎంపీలు ఆరోపించారు. కేంద్ర విధానాలు రాష్ట్రాలను నష్టపరిచే విధంగా ఉన్నాయని ఎంపీలు విమర్శించారు. ఆదివారం రాజ్యసభలో ప్రవేశపెడుతున్న..

  • Pardhasaradhi Peri
  • Publish Date - 7:07 pm, Sat, 19 September 20
కేంద్ర బిల్లులను వ్యతిరేకిస్తాం : టీఆర్ఎస్ ఎంపీలు

మోదీ సర్కారు రాష్ట్రాల హక్కులను హరించేలా వ్యవహరిస్తోందని టీఆర్ఎస్ ఎంపీలు ఆరోపించారు. కేంద్ర విధానాలు రాష్ట్రాలను నష్టపరిచే విధంగా ఉన్నాయని ఎంపీలు విమర్శించారు. ఆదివారం రాజ్యసభలో ప్రవేశపెడుతున్న రైతు బిల్లులను వ్యతిరేకిస్తామని ప్రకటించారు. శనివారం పార్లమెంట్ సమీపంలో ఎంపీలు మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుల కారణంగా దేశవ్యాప్తంగా రైతాంగం నష్టపోతుందని కేశవరావు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా రైతాంగం దెబ్బతినేలా లాక్‌డౌన్ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్సులు తీసుకొచ్చిందని విమర్శించారు. రైతాంగంపై ఎందుకింత కక్షపూరితంగా ఉన్నారు? దేశంలోని రైతులను బిచ్చగాళ్లుగా మార్చాలని అనుకుంటున్నారా? అని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. రైతు వ్యతిరేక బిల్లులు తెచ్చినందుకే ఎన్డీయేలో మిత్రపక్షంగా ఉన్న అకాలీదళ్ కూడా దూరమైందని నామా గుర్తుచేశారు. అయినాసరే రైతుల సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదని నామా ప్రశ్నించారు.