పాతబస్తీలో డ్రగ్స్ సరఫరా ముఠా అరెస్ట్

హైదరాబాద్ పాతబస్తీ కేంద్రంగా నిషేధిత డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠా సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీస్ లకు చిక్కింది. చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో

పాతబస్తీలో డ్రగ్స్ సరఫరా ముఠా అరెస్ట్
Follow us

|

Updated on: Sep 19, 2020 | 7:31 PM

హైదరాబాద్ పాతబస్తీ కేంద్రంగా నిషేధిత డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠా సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీస్ లకు చిక్కింది. చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు యువకులు మొహమ్మద్ షా ఫాహాద్, షైక్ అబ్దుల్ ఒవైస్ లను ఈ కేసుకు సంబంధించి పోలీసులు అరెస్ట్ చేశారు. పాతబస్తీలోని వివిధ జిమ్ లలో ఈ నిషేధిత డ్రగ్ సరఫరా చేస్తున్నారని పోలీసులు భావిస్తున్నారు. వీరి నుంచి 30ml స్టెరాయిడ్ ఇంజక్షన్లు 150 స్వాధీనం చేసుకొన్నారు. నిందితులను చదర్ ఘాట్ పోలీసులకు అప్పగించారు. ఈ ముఠాలో మొత్తం ఎంతమంది ఉన్నారు.. ఈ డ్రగ్ ఎవరెవరికి, ఎక్కడెక్కడ అందజేస్తున్నారు.. వీళ్లకి ఈ స్టెరాయిడ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయనేదానిపై పోలీసులు లోతుగా దర్యాప్తు ప్రారంభించారు.