AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాక్ చొరబాట్లకు కళ్లెం ! 3 వేల భారత అదనపు బలగాల మోహరింపు

కాశ్మీర్ లో వాస్తవాధీన రేఖ వద్ద పాకిస్థాన్ సైన్యం, ఉగ్రవాదుల చొరబాట్లను అడ్డుకునేందుకు ఇండియన్ ఆర్మీ అదనంగా 3 వేల బలగాలను మోహరించింది. ఈ ప్రాంతంలో ఇటీవల పాక్..

పాక్ చొరబాట్లకు కళ్లెం ! 3 వేల భారత అదనపు బలగాల మోహరింపు
Umakanth Rao
| Edited By: |

Updated on: Sep 19, 2020 | 8:45 PM

Share

కాశ్మీర్ లో వాస్తవాధీన రేఖ వద్ద పాకిస్థాన్ సైన్యం, ఉగ్రవాదుల చొరబాట్లను అడ్డుకునేందుకు ఇండియన్ ఆర్మీ అదనంగా 3 వేల బలగాలను మోహరించింది. ఈ ప్రాంతంలో ఇటీవల పాక్ తన సైనికుల సంఖ్యను పెంచిన విషయాన్ని భారత సైన్యం గ్రహించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇటీవలి కాలంలో పాక్ కాల్పుల విరమణ ఒప్పందాలను అదేపనిగా ఉల్లంఘిస్తోంది. తరచూ ఉగ్రవాదులు దొంగ చాటుగా కాశ్మీర్ లోకి చొరబడుతున్నారు. ఒకవైపు లడాఖ్ లో చైనా దళాల వల్ల భారత్ సమస్యను ఎదుర్కొంటుండగా మరో వైపు కాశ్మీర్ నియంత్రణ రేఖ వద్ద పాక్ బెడద కూడా అధికమైంది.

Follow Us