AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏంటయ్యా ఈ ఘోరం.. పెళ్లైన మూడు రోజులకే నూరేళ్లు.. భర్తతో కలిసి వస్తుండగా..

కరీంనగర్ జిల్లాలో పండుగ పూట విషాదం నెలకొంది.. ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుని.. కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఓ యువతి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. తిమ్మాపూర్‌లోని రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృత్యువాత పడటంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఏంటయ్యా ఈ ఘోరం.. పెళ్లైన మూడు రోజులకే నూరేళ్లు.. భర్తతో కలిసి వస్తుండగా..
Crime News
G Sampath Kumar
| Edited By: |

Updated on: Aug 10, 2025 | 9:42 AM

Share

కరీంనగర్ జిల్లాలో పండుగ పూట విషాదం నెలకొంది.. ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుని.. కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఓ యువతి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. తిమ్మాపూర్‌లోని రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృత్యువాత పడింది. చొప్పదండి మండలం రుక్మాపూర్ కు చెందిన ముద్దసాని అఖిల.. ఉస్మానియా యూనివర్సిటిలో పీజీ ప్రవేశ పరీక్ష రాసేందుకు వెళ్లింది.. తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో గల వాగేశ్వరీ ఇంజనీరింగ్ కళాశాలలోని అయాన్ డిజిటల్ జోన్ లో పీజీ ప్రవేశ పరీక్ష రాసిన అనంతరం భర్తతో కలిసి.. తిరిగి వస్తుండగా హైదరాబాద్ – రామగుండం రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదానికి గురైంది. గుర్తు తెలియని వాహనం అఖిల దంపతులు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది.. దీంతో దంపతులిద్దరూ రోడ్డుపై పడిపోయారు. అఖిల రోడ్డుపై మధ్యలో పడిపోవడంతో వెనుక నుంచి వచ్చిన లారీ ఆమె తలపై నుండి వెళ్లింది.. దీంతో అక్కడిక్కడే మృతి చెందింది.

కాగా అఖిలకు మూడు రోజుల క్రితమే జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లొత్తునూర్ గ్రామానికి చెందిన ఓ యువకుడితో వివాహం అయింది. పెళ్లి తర్వాత కుటుంబంతో ఎంతో ఆనందంగా ఉండాల్సిన సమయంలో అఖిల మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. అఖిల కాళ్లకు పెట్టిన పారాణి కూడా పూర్తిగా ఆరక ముందే ముందే, కానరాని లోకాలకు వెళ్ళింది.

కాగా.. ఈ ఘటనకు ముందు ఇంటి వద్ద కూతురు రాక కోసం తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. నల్ల పూసలు కుట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతలోనే విషాద వార్త. రోడ్డు ప్రమాదంలో కూతురు చనిపోయిందని తెలియడంతో కుటుంబసభ్యులు కుప్ప కూలిపోయారు. ఎంతో సంతోషంగా ఇంటి నుంచి వెళ్లిన కూతురు విగత జీవిగా తిరిగి రావడంతో తల్లిదండ్రులు తట్టుకోవడం లేకపోతున్నారు.. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
బీకేర్‌ఫుల్‌.. ఇలాచేస్తే ఫ్రిడ్జ్‌ పేలిపోతుంది జాగ్రత్త!
బీకేర్‌ఫుల్‌.. ఇలాచేస్తే ఫ్రిడ్జ్‌ పేలిపోతుంది జాగ్రత్త!
మసాలా ద్రాక్ష ఇలా చేసి తింటే.. ఆ ప్రాణాంతక సమస్య దెబ్బకు పరార్
మసాలా ద్రాక్ష ఇలా చేసి తింటే.. ఆ ప్రాణాంతక సమస్య దెబ్బకు పరార్
శాంసన్, బుమ్రా, ఇషాన్ కాదు.! వాళ్లే అసలైన మ్యాచ్ విన్నర్‌లు..
శాంసన్, బుమ్రా, ఇషాన్ కాదు.! వాళ్లే అసలైన మ్యాచ్ విన్నర్‌లు..
గ్యాస్ బుకింగ్స్‌పై కేంద్రం నుంచి కీలక ప్రకటన.. కొత్త డెసిషన్
గ్యాస్ బుకింగ్స్‌పై కేంద్రం నుంచి కీలక ప్రకటన.. కొత్త డెసిషన్
మీరు దరిద్రంలో ఉన్నారా..? అయితే మీ చెప్పులను అక్కడ వదిలిస్తే..
మీరు దరిద్రంలో ఉన్నారా..? అయితే మీ చెప్పులను అక్కడ వదిలిస్తే..
అఫీషియల్.. విడాకులు తీసుకున్న హన్సిక.. భరణం విషయంలో సంచలన నిర్ణయం
అఫీషియల్.. విడాకులు తీసుకున్న హన్సిక.. భరణం విషయంలో సంచలన నిర్ణయం
యుద్దం ఎఫెక్ట్.. గ్యాస్ బాటలో పెరగనున్న వీటి ధరలు..
యుద్దం ఎఫెక్ట్.. గ్యాస్ బాటలో పెరగనున్న వీటి ధరలు..
హైదరాబాద్‌ నుంచి బయల్దేరిన విమానం.. రన్‌వేపై ల్యాండవుతుండగా ఊడిన
హైదరాబాద్‌ నుంచి బయల్దేరిన విమానం.. రన్‌వేపై ల్యాండవుతుండగా ఊడిన
మీనంలో గ్రహాల సందడి...వారికి రాజయోగాలు, ధనయోగాలు
మీనంలో గ్రహాల సందడి...వారికి రాజయోగాలు, ధనయోగాలు
ఇంట్లో ఈ జంతువులు ఉంటే మీ తలరాతే మారిపోతుంది.. డబ్బే డబ్బు..
ఇంట్లో ఈ జంతువులు ఉంటే మీ తలరాతే మారిపోతుంది.. డబ్బే డబ్బు..