AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: మీరు ఇక మారరా.. తల్లిదండ్రుల గొడవ.. బాధతో కొడుకు ఏం చేశాడంటే..?

మైనర్ బాలుడు తన తల్లిదండ్రుల నిత్య కలహాలతో విసిగిపోయి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. గొడవలు మానుకోవాలని, ప్రేమగా ఉండాలని కోరుతూ ఒక లేఖ రాసి సంతకం చేయమన్నాడు. తండ్రి సంతకం చేసినా, తల్లి నిరాకరించడంతో బాలుడు తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. జగిత్యాల జిల్లాలో జరిగిన ఈ ఘటన.. తల్లిదండ్రుల మధ్య విభేదాలు పిల్లల మానసిక ఆరోగ్యంపై ఎంతటి దుష్ప్రభావం చూపుతాయో తెలియజేస్తుంది.

Telangana: మీరు ఇక మారరా.. తల్లిదండ్రుల గొడవ.. బాధతో కొడుకు ఏం చేశాడంటే..?
Son Ends Life After Parents Fight
G Sampath Kumar
| Edited By: |

Updated on: Nov 23, 2025 | 11:21 AM

Share

అమ్మ..నాన్న ప్రేమగా ఉండాలని కొడుకు కోరుకున్నాడు.. కానీ..నిత్యం గొడవలే.. ఇద్దరు చేతులు పట్టుకొని.. గొడవలు వద్దు..అమ్మ..నాన్న అని వేడుకున్నాడు..కానీ..వీరి మనస్సు కరగలేదు. చివరి ప్రయత్నం లో కలిసి ఉండాలని ఓ లేఖ రాసి..అందులో సంతకం పెట్టాలని కోరాడు. కానీ..నాన్న సంతకం పెట్టిన..అమ్మ పెట్ట లేదు.. బాబు మరింత ఆవేదన కు గురై. రూమ్ లోకి వెళ్లి ఉరి వేసుకొని ఆత్మ హత్య చేసుకున్నాడు.ఈ సంఘటన ప్రతి తల్లిదండ్రులను కదిలిస్తుంది.

తల్లిదండ్రులు ప్రేమగా, సంతోషంగా కలిసి ఉండాలని కోరుకున్న పన్నెండేళ్ల కొడుకు ఆశ నిరాశ కావడంతో తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో జరిగింది. కోరుట్లలోని రకాల పంపు ఏరియాలో నివాసం ఉంటున్న రవి, అపర్ణ దంపతులకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. అయితే ఇంట్లో నిత్యం తల్లిదండ్రుల మధ్య ఘర్షణలు జరుగుతుండటంతో కొడుకు తీవ్ర ఆవేదన చెందేవాడు. వారిద్దరూ చేతులు పట్టుకుని గొడవలు మానుకోవాలని, ప్రేమగా ఉండాలని పలుమార్లు వేడుకున్నా ఫలితం లేకపోయింది. తల్లిదండ్రులు మారకపోవడంతో ఆ బాలుడు లోలోపల కుమిలిపోయాడు.

చివరి ప్రయత్నం కూడా..

శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో తల్లిదండ్రులు మళ్లీ గొడవ పడుతుండగా, ఆ బాలుడు మరింత ఆందోళనకు గురయ్యాడు. “మీరు మారరు.. నేను చనిపోతాను” అని తల్లిదండ్రులతో చెప్పడంతో వారు కాసేపు గొడవ ఆపారు. అప్పుడు ఆ కొడుకు ఒక లేఖ రాశాడు. ఆ లేఖలో వారు గొడవ పడబోమని వాగ్దానం చేయాలని, దానికి ఇద్దరూ సంతకం పెట్టాలని కోరాడు. కొడుకు ఆవేదనను చూసి తండ్రి రవి వెంటనే ఆ పేపర్‌పై సంతకం పెట్టాడు. కానీ తల్లి అపర్ణ మాత్రం సంతకం పెట్టడానికి నిరాకరించింది.

విషాదంతో ముగిసిన జీవితం

తల్లి సంతకం పెట్టకపోవడం, తన చివరి ప్రయత్నం కూడా విఫలం కావడంతో ఆ బాలుడు మరింత తీవ్రమైన ఆందోళనకు గురయ్యాడు. వెంటనే ఇంట్లోని ఒక గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. ఎంత పిలిచినా డోర్ తీయకపోవడంతో అనుమానం వచ్చి బలవంతంగా తలుపులు తెరిచి చూడగా, అప్పటికే కొడుకు ఉరి వేసుకుని విగతజీవిగా కనిపించాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కొడుకు తమను వదిలి వెళ్లడాన్ని జీర్ణించుకోలేక బోరున విలపించారు.

స్థానికులు మాట్లాడుతూ.. “తల్లి ఒక్క సంతకం పెట్టి ఉంటే ఈ దారుణం జరిగి ఉండేది కాదు. ఇద్దరి గొడవల వల్ల ఒక బిడ్డ ప్రాణం పోయింది. ఇప్పుడు తల్లిదండ్రులు ఎంత ఏడ్చినా ఏమి లాభం?” అని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల మధ్య విభేదాలు పిల్లల మానసిక ఆరోగ్యంపై ఎంతటి తీవ్ర ప్రభావం చూపుతాయో చెప్పడానికి ఈ సంఘటన ఒక కదిలించే ఉదాహరణగా నిలిచింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..