Watch Video: ‘అన్న లేకుంటే ఆత్మహత్య చేసుకునేవాడిని’.. బీఆర్ఎస్ ఎంపీ కాళ్లు మొక్కిన బండ్ల గణేష్..
Bandla Ganesh: తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన బండ్ల గణేష్.. అనతికాలంలో బడా ప్రొడ్యూసర్‌గా ఎదిగారు. పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన బండ్ల గణేష్.. అనతికాలంలో బడా ప్రొడ్యూసర్‌గా ఎదిగారు. పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే, ఈ సినీ కెరీర్ అయినా, పొలిటికల్ కెరీర్ అయినా సంచలనమే. ఆయన ఏం చేసినా సంచలనంగా ఉంటుంది. తాజాగా మరోసారి హాట్‌టాపిక్‌గా మారారు నిర్మాత బండ్ల గణేష్. బీఆర్ఎస్ పార్టీ ఎంపీ రంజిత్ రెడ్డి కాళ్లు మొక్కారు గణేష్. తాను ఏ పార్టీలో లేను అంటూనే.. రంజిత్ రెడ్డి వెనుక ఉన్నానంటూ ప్రకటించారు. అంతేకాదు.. రంజిత్ రెడ్డి లేకుంటే తాను ఆత్మహత్య చేసుకునే వాడినని షాకింగ్ కామెంట్స్ చేశారు బండ్ల గణేష్.
ఇవాళ ఎంపీ రంజిత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో బండ్ల గణేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్.. ఎంపి రంజిత్ రెడ్డి పాదాలకు నమస్కరించారు. వెంటనే పైకి లేపిన ఎంపీ రంజిత్ రెడ్డి.. గణేష్ భుజాలు తట్టారు. అనంతరం మాట్లాడిన గణేష్.. ‘‘రంజిత్ రెడ్డి లేకుంటే ఆత్మహత్య చేసుకునేవాడిని. రంజిత్ అన్న దేవుడితో సమానం. నేను ఏ పార్టీలో లేను.. కానీ రంజిత్ అన్న వెనుక ఉన్నాను.’’ అంటూ ఓవైపు రంజిత్‌పై ప్రశంసలు కురిపిస్తూనే మరోవైపు పాలిటిక్స్‌పై ఫుల్ క్లారిటీ ఇచ్చారు.
సినీ నిర్మాతగా మంచి గుర్తింపు పొందిన బండ్ల గణేష్.. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో బండ్ల.. పాలిటిక్స్ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. ఇక తాను ఏ పార్టీలోనూ చేరబోనని ప్రకటించారు. అయితే, పార్టీల్లో లేకపోయినప్పటికీ.. అడపాదడపా రాజకీయ నాయకులపై ప్రశంసలు, కామెంట్స్ చేస్తూనే వస్తున్నారు గణేష్.
రంజిత్ రెడ్డి కాళ్లు మొక్కిన బండ్ల గణేష్..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..