Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tiger – Telangana: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మ్యాన్ ఈటర్ కలకలం.. అలర్ట్ ప్రకటించిన అధికారులు..

Tiger Fear: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం అడవుల్లో పెద్దపులి అలజడి కలకలం రేగింది. తాడ్వాయి అటవీ ప్రాంతం నుండి కరకగూడెం అడవుల్లోకి పెద్దపులి ప్రవేశించింది.

Tiger - Telangana: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మ్యాన్ ఈటర్ కలకలం.. అలర్ట్ ప్రకటించిన అధికారులు..
Tiger
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 12, 2021 | 7:59 AM

Tiger Fear: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం అడవుల్లో పెద్దపులి అలజడి కలకలం రేగింది. తాడ్వాయి అటవీ ప్రాంతం నుండి కరకగూడెం అడవుల్లోకి పెద్దపులి ప్రవేశించింది. కరకగూడెం మండలం రఘునాదపాలెం అడవుల్లో పెద్దపులి సంచరిస్తోంది. రఘునాదపాలెం అటవీ ప్రాంతంలో పశువుల కాపరులు పశువులను మేపుతుండగా.. పెద్దపులి వారి కంట పడింది. వెంటనే ప్రాణ భయంతో వారు అక్కడి నుంచి పారిపోయారు. పెద్దపులి సంచారానికి సంబంధించిన సమాచారాన్ని అటవీశాఖ అధికారులకు చేరవేశారు. పశువుల కాపరులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి వెళ్లిన అటవీశాఖ అధికారులు.. పులి పాదముద్రలను పరిశీలించారు. ఆ పాదముద్రల ఆధారంగా పులి సంచారాన్ని నిర్ధారించారు. సంచరిస్తున్న పులి వయసు సుమారు ఐదు సంవత్సరాలు ఉంటుందని, ఇది మ్యాన్ ఈటర్ అని పాదముద్రల ఆనవాళ్ల ఆధారంగా గుర్తించారు అధికారులు.

అటవీ ప్రాంతంలో ఎవరూ సంచరించకూడదంటూ అటవీశాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. ఆ మేరకు ప్రచారం చేస్తున్నారు. ప్రజలు అలర్ట్‌గా ఉండాలని సూచించారు. పులి జాడ కోసం అటవీశాఖ అధికారులు అడవుల్లో గాలింపు చర్యలు చేపట్టారు. రఘునాథపాలెం అడవుల నుంచి చిరుమళ్ల అడవుల్లోకి ప్రవేశించినట్లుగా అధికారులు గుర్తించారు. కాగా, ఏడాది తరువాత మళ్లీ మ్యాన్ ఈటర్ ఎంటరవడంత పినపాక అడవుల్లో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు ఫారెస్ట్ సిబ్బంది. మరోవైపు పెద్దపులి రాకతో స్థానిక ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు గురవుతున్నారు. ఏక్షణంలో ఏ వైపు నుంచి దాడి చేస్తుందోనని ఆందోళనకు గురవుతున్నారు. మ్యాన్ ఈటర్‌ను వీలైనంత త్వరగా బంధించాలని అధికారులను వేడుకుంటున్నారు.

Also read:

Type 2 Diabetes: టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో పోస్ట్-కోవిడ్‌లో జాగ్రత్తగా ఉండండి..తాజా అధ్యయనంలో వెలుగు చూస్తున్న సమస్యలు..

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. రూ.2 వేలు కోసం స్నేహితుడి హత్య.. గొంతు కోసి..

Watch Video: ‘అంపైర్ కిల్లర్’ బాల్‌ని చూశారా? తృటిలో తప్పిన పెను ప్రమాదం.. వైరలవుతోన్న వీడియో