Telangana: ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్ ను ఢీకొని కారు బోల్తా.. ముగ్గురు మృతి..
నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కట్టంగూరు మండలం యరసానిగూడెం వద్ద డివైడర్ ఢీ కొని కారు బోల్తా పడిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో ఆరుగురు యువకులకు గాయాలయ్యాయి. వారిని..

నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కట్టంగూరు మండలం యరసానిగూడెం వద్ద డివైడర్ ఢీ కొని కారు బోల్తా పడిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో ఆరుగురు యువకులకు గాయాలయ్యాయి. వారిని సమీపంలోని కామినేని ఆస్పత్రికి తరలించారు. మృతులు ఖమ్మం జిల్లా వాసులుగా గుర్తించారు. హైదరాబాద్ వివాహానికి హాజరై ఖమ్మం వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న స్థానికులు.. వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను, సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. క్షతగాత్రులకు చికిత్స అందించేందుకు సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. తెల్లవారు జామున జరిగిన ఈ ఘటనతో హైవేపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం..