అయ్యో దేవుడా..! అప్పుడే పుట్టిన బిడ్డ.. భర్త.. భార్య.. ఏజెన్సీలో గంటల వ్యవధిలో కుటుంబంలో ముగ్గురు మృతి..
చింతూరు ఏజెన్సీలో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. గంటల వ్యవధిలో కళ్లముందే ముగ్గురు చనిపోవడం వైద్యులను సైతం కలిచివేసింది.

చింతూరు ఏజెన్సీలో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. గంటల వ్యవధిలో కళ్లముందే ముగ్గురు చనిపోవడం వైద్యులను సైతం కలిచివేసింది. త్వరలో తమకు శిశువు పుట్టబోతుందన్న గంపెడాశతో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి వచ్చిన గిరిజన దంపతుల కుటుంబాలకు నిరాశే ఎదురైంది. గర్భంలోనే శిశువు మృతిచెందడంతో.. తండ్రి తట్టుకోలేక మృతిచెందాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య కూడా కొన్ని గొంటల్లోనే మరణించింది. ఈ విషాద ఘటన చింతూరు మండలం ఇర్కంపేటలో జరగింది.
చింతూరు ఏజెన్సీ ఏరియాకు చెందిన ఐతయ్య, కమల దంపతులు.. కమల నిండు గర్భిణి. ఈ సమయంలో కొవ్వాసి కమల (27) కు తీవ్ర రక్తస్రావం కావడంతో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చాడు. అప్పటికే పరిస్థితి విషమించడంతో కమలకు ఆపరేషన్ చేశారు వైద్యులు. మృత మగశిశువును వైద్యులు బయటకు తీశారు. అయితే, కాన్పు ఫలించకపోవడంతో ఐతయ్య తీవ్ర నిరాశకుగురయ్యాడు. ఈ క్రమంలో గుండెపోటు రావడంతో ఐతయ్య ఆస్పత్రిలోనే కుప్పకూలాడు. అతనికి చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. గుండెపోటుతో ఐతయ్య మరణించినట్లు వైద్యులు వెల్లడించారు.
కాగా, పుట్టిన శిశువు, భర్త ఇద్దరూ చనిపోవడంతో కమల కూడా కొన్ని గంటల వ్యవధిలోనే కన్నుమూసింది. ఈ ఘటన అనంతరం ఐతయ్య కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.




మరిన్ని ఏపీ వార్తల కోసం..
