TSRTC: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆ ఇబ్బందులు తొలగించేందుకు ఆర్టీసీ ప్రత్యేక చర్యలు..

సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారి కోసం.. ఇప్పటికే ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన టీఎస్ఆర్టీసీ మరో అడుగు ముందుకేసింది. ప్రయాణీకులను వారి గమ్యస్థానాలకు త్వరగా చేర్చడమే లక్ష్యంగా.. ప్రత్యేక...

TSRTC: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆ ఇబ్బందులు తొలగించేందుకు ఆర్టీసీ ప్రత్యేక చర్యలు..
Toll Plaza
Follow us

|

Updated on: Jan 08, 2023 | 8:07 AM

సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారి కోసం.. ఇప్పటికే ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన టీఎస్ఆర్టీసీ మరో అడుగు ముందుకేసింది. ప్రయాణీకులను వారి గమ్యస్థానాలకు త్వరగా చేర్చడమే లక్ష్యంగా.. ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ మేరకు టీఎస్‌ఆర్టీసీ బస్సులకు టోల్‌ ప్లాజాల వద్ద ప్రత్యేక లేన్‌ ఏర్పాటు చేసింది. ప్రతి టోల్‌ ప్లాజా వద్ద ఆరుగురు ఆర్టీసీ సిబ్బంది విధులు నిర్వహిస్తారు. బస్‌ భవన్‌, ఎంజీబీఎస్‌లో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు. పండుగ కారణంగా టోల్‌ప్లాజాల వద్ద వాహనాల రద్దీ నెలకొంటుంది. దీంతో ట్రాఫిక్ ఏర్పడుతుంది. ఈ సమస్య నుంచి ప్రయాణీకులకు ఉపశమనం కలిగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీఎస్ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఈ నెల10 నుంచి 14 వరకు హైదరాబాద్‌ – విజయవాడ, హైదరాబాద్‌ – బెంగళూరు, హైదరాబాద్‌ – నిజామాబాద్‌, హైదరాబాద్‌ – వరంగల్‌, హైదరాబాద్‌ – సిద్దిపేట తదితర జాతీయ రహదారుల్లోని టోల్‌ప్లాజాల వద్ద ప్రత్యేక మార్గ సదుపాయం అందుబాటులో ఉంటుంది.

ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేకంగా రూపొందించిన జీవా(జెడ్‌ఐవీఏ) మినరల్‌ వాటర్‌ బాటిళ్ల విక్రయాలను సోమవారం నుంచి ప్రారంభించనున్నట్లు టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ వెల్లడించారు. ఈ మేరకు ఓ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. రాష్ట్రంలోని అన్ని బస్‌స్టేషన్లలో ఈ సదుపాయం అందుబాటులో ఉంటాయన్నారు. సొంత బ్రాండు శుద్ధజలాన్ని తయారుచేసి విక్రయించాలని కొన్ని నెలలుగా సాగుతున్న కసరత్తు ఓ కొలిక్కి వచ్చినట్లయింది. సోమవారం ‘జీవా’ నీటి సీసాలను ఆవిష్కరించనున్నారు. ప్రయాణికులు ఆదరించాలని కోరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..