Cock Fights : సమరోత్సాహంతో కదం తొక్కుతున్న సంక్రాంతి కోళ్లు.. పందాలకు అనుమతులపై పోలీసులు ఏమంటున్నారంటే..
సంక్రాంతికి పది రోజుల ముందే కోడిపందేలు, గుండాట, పేకాట జోరుగా సాగుతోంది. ఒకవైపు పోలీసులు వార్నింగ్ ఇస్తున్నా పందేలకు బరులు రెడీ చేస్తున్నారు నిర్వాహకులు. అయితే పోలీసులు మాత్రం..

బరులు సిద్ధమయ్యాయి. సంక్రాంతి కాక్ ఫైట్‌కు సై అంటూ పందెంకోళ్లు కాలు దువ్వుతున్నాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో కోడి పందేల సందడి జోరుమీదుంది. కత్తి గట్టిన పందెంకోళ్లు.. యుద్ధానికి సిద్ధమంటున్నాయి. సమరోత్సాహంతో కదం తొక్కుతున్నాయి. అయితే ఒకవైపు బరులు సిద్ధమవుతుంటే.. మరోవైపు కోడి పందాలపై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. సంక్రాంతి పందెంరాయుళ్లుకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పందేలకు స్థలాలు, తోటలు లీజుకిచ్చేవారికి కూడా ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. రూల్స్ బ్రేక్ చేసి బరులకు స్థలాలిస్తే క్రిమినల్ కేసులు పెడతామని వార్నింగ్ ఇస్తున్నారు. అంతేకాదు. పలు ప్రాంతాల్లో పందాలకు సిద్ధమవుతున్న బరులను ధ్వంసం చేస్తున్నారు. ఆకివీడు, భీమవరం, అడవి నెక్కలంలో బరులను.. ట్రాక్టర్లతో దున్నేస్తున్నారు.
మరోవైపు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో గత మూడేళ్లలో 4వేల కేసులు నమోదయ్యాయి. 7వేల మందిని అరెస్ట్ చేశారు. ఐతే ఈ ఏడాది మాత్రం ఇప్పటికే 15 వందల మందిపై బైండోవర్ కేసులు ఫైల్ చేశారు. భారీగా కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నారు.
అయినా సరే తగ్గేదే లేదంటున్నారు పందెంరాయుళ్లు. కోడి పందాలపై ఆంక్షలున్నా.. ఆదేశాలున్నా బరులు గీసేశారు. కాళ్లకి కత్తిగట్టి కోళ్లను రెడీ చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం
