Road Accident: స్నేహితుడి వివాహానికి వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
Nagarkurnool Road Accident: తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు
Nagarkurnool Road Accident: తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతుల్లో ఇద్దరు యువతులు ఉన్నారు. వేగంగా దూసుకువచ్చిన కారు అదుపు తప్పి జిల్లాలోలని (Nagarkurnool district) కల్వకుర్తి మండలం మార్చాల సమీపంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో (Road Accident) ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మృతులు మహబూబాబాద్‌కు చెందిన కిరణ్మయి (22), పిఎ పల్లికి చెందిన శిరీష (20), కొండమల్లే పల్లి అన్నేపక అరవింద్ (23) గా పోలీసులు గుర్తించారు.
వెల్దండ మండలం బండోనిపల్లి గ్రామంలో జరిగిన స్నేహితుడి వివాహానికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గాయాలపాలైన వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కల్వకుర్తి పోలీసులు తెలిపారు. వేగంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
Also Read: